Home /News /movies /

SAMPOORNESH BABU DAGAD SAMBA HERO SAMPU INTERVIEW CHITCHAT WITH MEDIA TA

Sampoornesh Babu - Dagad Samba : ‘ధగఢ్ సాంబ’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది..  హీరో సంపూర్ణేష్ బాబు..

సంపూర్ణేష్ బాబు (Twitter/Photo)

సంపూర్ణేష్ బాబు (Twitter/Photo)

Sampoornesh Babu - Dagad Samba : ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ ముందుకు రానున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా సంపూ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఇంకా చదవండి ...
  Sampoornesh Babu - Dagad Samba : ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది.  మే 20 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు. ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల చిన్నపుడు తన ఆస్తి అంతా కొల్పేతే..మళ్లీ అది సంపాదించుకోవడానికి వాళ్ళు చేసే అన్యాయాన్ని అరికట్టే క్రమంలో జరిగే సినిమా "డగడ్ సాంబ". టైటిల్ కు  తగ్గట్టే ఈ సినిమా చాలా డీఫ్రెంట్ గా ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ తో పాటు చిన్న హర్రర్ టచ్ ఉంటుంది.

  ఇప్పటివరకు నేను ఎక్కువగా కామెడీ రోల్ లో నటించాను. ఇందులో మొదటి సాటి హర్రర్ వైపు అంటే సీరియస్ గా వుండే డీఫ్రెంట్ సబ్జెక్ట్ చేశాను. కొబ్బరి మట్ట,సింగం 123, పెదరాయుడు వంటి సినిమాలో ఎక్కువగా స్కూప్స్ వున్నా ఈ సినిమాలో అలాంటి స్కూప్స్ ఉండవు. ఇందులోని డైలాగ్స్ డీఫ్రెంట్ గా ఉంటాయి. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసిందన్నారు. అలాగే నాతో పాటు జ్యోతి, బాషా, అప్పారావు నటించారు.
  ఈసినిమా లో ఉన్న నాలుగు ఫైట్స్ ను నలుగురు ఫైట్ మాస్టర్స్ తో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ మరియు ఎన్నో.. ట్విస్ట్ టర్న్స్ తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుందన్నారు.

  Tollywood 1st Week AP - TG Highest share Movies : టాలీవుడ్ ఫస్ట్ వీక్ హైయ్యెస్ట్ షేర్ మూవీస్.. ’సర్కారు వారి పాట’ సహా టాప్ 10 మూవీస్ ఇవే..


  కొబ్బరిమట్ట తర్వాతా కొన్ని పెద్ద బ్యానర్స్ లో సినిమా అవకాశాలు వవ్భినా కొన్ని కారణాలు వలన అవి పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇంతలో దర్శకుడు.యన్.ఆర్. రెడ్డి గారు ఈ కథ చెప్పడం జరిగింది. కథ నాకు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను.కెమెరామెన్ ముజీర్ కొబ్బరిమట్ట నుండి నాతో జర్నీ చేస్తున్నాడు. అలాగే అందరు టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు నా సినిమాలను ఆదరించారు. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

  Sarkaru Vaari Paata 1st Week WW Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీక్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

  ఇప్పటి వరకు నేను 12 సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఏడవ సినిమా ఇంకా మూడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ."బ్రిలియంట్ బాబు" సన్నాఫ్ తెనాలి, "దాన వీర శూరకర్ణ", మిస్టర్ బెగ్గర్, మరియు ఒక తమిళ్ సినిమాలో హీరో గా చేస్తున్నాను అది 70% షూట్ కంప్లీట్ అయ్యింది.ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని  కోరుకుంటున్నాను..అని ముగించారు
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Sampoornesh babu, Tollywood

  తదుపరి వార్తలు