• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMPOORNESH BABU ANOTHER MOVIE WITH CRAZY TITLE CAULIFLOWER AND FIRST LOOK RELEASED TA

Sampoornesh Babu - Cauliflower: సంపూర్ణేష్ బాబు నుంచి మరో క్రేజీ సినిమా.. క్యాలీఫ్లవర్‌ టైటిల్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్..

Sampoornesh Babu - Cauliflower: సంపూర్ణేష్ బాబు నుంచి మరో క్రేజీ సినిమా.. క్యాలీఫ్లవర్‌ టైటిల్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్..

‘సంపూర్ణేష్ బాబు’ ‘క్యాలీఫ్లవర్’లుక్ విడుదల (Twitter/Photo)

Sampoornesh Babu - Cauliflower | టాలీవుడ్‌లో ‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. తాజాగా సంపూ.. ‘క్యాలీఫ్లవర్’ సినిమాతో పలకరించనున్నారు.

  • Share this:
    Sampoornesh Babu - Cauliflower | టాలీవుడ్‌లో ‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు.. సింగం 123, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పటకే సంపూర్ణేష్ బాబు.. ‘బజార్ రౌడీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంపూర్ణేష్ బాబు. .‘క్యాలీఫ్లవర్’ సినిమాను అనౌన్స్ చేసారు. మే 9న సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు.. ఇంగ్లీష్ దొరబాబు గెటప్‌లో కొత్తగా ఉన్నారు. దీనికి ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉప శీర్షిక. ఆర్.కే.మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఆశాజ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సంపూర్ణేష్ బాబు.. ఇంగ్లాడు దొరబాబుగా కనపించనున్నారు.

    అక్కడి నుంచి మన దేశానికి ఈ ఇంగ్లీష్ దొర ఎందుకు వచ్చాడనేదే ఈ సినిమా. ఈ సినిమాను ఆద్యంతం కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘క్యాలీఫ్లవర్‌’ సంపూ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: