Home /News /movies /

SAMPATH NANDI PLANNING FOR A MOVIE WITH CHIRANJEEVI HERE ARE THE DETAILS SR

రజాకార్ల నేపథ్యంలో చిరంజీవి హీరోగా సంపత్ నంది సినిమా..

చిరంజీవి, సంపత్ నంది Photo : Twitter

చిరంజీవి, సంపత్ నంది Photo : Twitter

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- రజాకార్ల నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ సంపత్ నంది ఓ కథను సిద్ధం చేసుకున్నాడట.

    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- రజాకార్ల నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ సంపత్ నంది ఓ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించాలనీ భావిస్తున్నాడట. అందులో భాగంగా సంపత్ నంది త్వరలోనే చిరంజీవికి వినిపించడానికి సిద్ధమవుతున్నాడటాక్. ఈ విషయాన్ని సంపత్ నంది తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఆయన 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నాడు. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలనీ చూస్తోంది చిత్రబృందం.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Chirajeevi, Sampath Nandi, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు