• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMEERA REDDY TESTED COVID POSITIVE AND HER FAMILY MEMBERS ALSO TESTED CORONA POSITIVE AND SHE GIVES HEALTH UPDATE OF FAMILY DETAILS GH TA

Sameera Reddy Covid Positive: కరోనా బారిన పడ్డ సమీరా రెడ్డి కుటుంబం.. పిల్లల ఆరోగ్యం గురించి వెల్లడించిన ఎన్టీఆర్ భామ..

Sameera Reddy Covid Positive: కరోనా బారిన పడ్డ సమీరా రెడ్డి కుటుంబం.. పిల్లల ఆరోగ్యం గురించి వెల్లడించిన ఎన్టీఆర్ భామ..

సమీరా రెడ్డికి కరోనా పాజిటివ్ (sameera reddy)

తనకు ఇటీవల కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అప్పటి నుంచి సమీరా రెడ్డి త్వరలో కోలుకోవాలని ఆమె అభిమాన?

  • Share this:


Sameera Reddy Covid Positive | తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటించిన సమీరా రెడ్డికి  చాలామంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తరువాత భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను ఆమె తరచుగా అభిమానులతో షేర్ చేస్తూ ఎపుడు వార్తల్లో ఉంటుంటారు.  తనకు ఇటీవల కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అప్పటి నుంచి సమీరా రెడ్డి త్వరలో కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఆమె కుటుంబం గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీర ఒక షాకింగ్ వార్త చెప్పారు. కుటుంబంలో తన అత్తగారికి తప్ప మిగతా అందరికీ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు తెలిపారు. తాజాగా తమ పిల్లలు హన్స్ వర్దే, నైరా వర్దే ఇంట్లో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సమీర దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. తాజాగా వీరందరూ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరి ఆరోగ్యం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ‘చాలామంది అభిమానులు హన్స్, నైరా గురించి నన్ను అడుగుతున్నారు. వారికి సంబంధించిన అప్‌డేట్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోకు ట్యాగ్ రాశారు.



పిల్లల గురించి, వారు కరోనా బారిన పడ్డ వివరాలు, సంరక్షణ పద్దతుల గురించి సమీరా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.  లాస్ట్ వీక్ హన్స్‌కు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురయ్యాయి. నాలుగు రోజుల పాటు తనలో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో కోవిడ్ పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. నేను మొదట్లో భయపడ్డాను. ఆ తరువాత నైరాలో కూడా ఇవే లక్షణాలు కనిపించాయి. తనకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అని సమీరా వివరించారు.



రెండో దశలో కరోనా పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని సమీరా రెడ్డి తెలిపారు. ‘చాలా సందర్భాల్లో పిల్లల్లో తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయని డాక్టర్లు భావిస్తున్నారు. వారు విటమిన్ సి, మల్టీ విటమిన్ మాత్రలు కూడా సిఫారసు చేస్తున్నారు. వైద్యుల సలహాతో పిల్లలకు ప్రోబయోటిక్, జింక్, ఇతర మెడిసిస్ ఇచ్చాను. వారి కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నాను. ప్రస్తుతం ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకుముందు మాదిరిగానే ఉల్లాసంగా మారారు’ అని వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన పిల్లలను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని చెప్పారు.

సమీరా రెడ్డి (sameera reddy)
సమీరా రెడ్డి (sameera reddy)


పిల్లలకు పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత భర్త అక్షయ్‌తో పాటు తనకు కూడా కరోనా సోకిందని సమీరా రెడ్డి పేర్కొన్నారు. దీంతో మందులు వేసుకోవడం, ఆవిరి పీల్చడం, ఉప్పునీటితో పుక్కిలించడం, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి ప్రారంభించామని చెప్పారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి కఠినమైన సందర్భాల్లో భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

First published: