Sameera Reddy : తెల్ల జుట్టు గురించి తండ్రితో సమీరా రెడ్డి సంభాషణ.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్..

సమీరా రెడ్డి (Instagram/Photo)

సమీరా రెడ్డి తన తండ్రితో తెల్లజుట్టు, వృద్ధాప్యం గురించి మాట్లాడిన ఒక పవర్‌ఫుల్ సంభాషణను అభిమానులతో పంచుకున్నారు. తెల్లజుట్టుక?

  • Share this:
Sameera Reddy : నటి సమీరారెడ్డి నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. పెళ్లయిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. కానీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఇప్పటికీ టచ్ లోనే ఉంటున్నారు. తన వర్కౌట్లు, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. సెల్ఫ్ లవ్, బాడీ పాజిటివిటీ, ఫిట్‌నెస్ గురించే ఎక్కువగా పోస్టులు పెడుతుంటారు. అయితే తాజాగా ఆమె తన తండ్రితో తెల్లజుట్టు, వృద్ధాప్యం గురించి మాట్లాడిన ఒక పవర్‌ఫుల్ సంభాషణను అభిమానులతో పంచుకున్నారు. తెల్లజుట్టుకు రంగు ఎందుకు వేసుకోవడం లేదని తన తండ్రి తనని అడిగినట్లు సమీరా రెడ్డి (Sameera Reddy) వెల్లడించారు.

తెల్ల జుట్టును ఎందుకు కవర్‌ చేసుకోవట్లేదని నాన్న నన్ను అడిగారు. జనాలు నా వైట్ హెయిర్ గురించి ఏమంటారో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రశ్నకు నేను ఇలా సమాధానమిచ్చాను 'ప్రజలు నా తెల్ల వెంట్రుకల గురించి మాట్లాడితే... నేను ముసలి దాన్ని అయిపోయినట్లేనా? లేక అందంగా లేనన్నట్లా ? లేదా శుభ్రంగా లేనట్లా ?’ అని సూటిగా ప్రశ్నించాను.

Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

గతంలో లాగా నేను నా జుట్టు గురించి బాధపడటం లేదన్నాను. నాలో ఆ స్వేచ్ఛ ఇప్పుడిప్పుడే పరిమళిస్తుందని చెప్పాను. గతంలో నేను ప్రతి రెండు వారాలకు ఒక్కసారి జుట్టుకు రంగు వేసుకునేదాన్ని. అందుకే ఎవరూ నా వైట్ హెయిర్ లైన్ గురించి తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు నాకు వీలైనప్పుడు మాత్రమే రంగు వేసుకుంటున్నాను" అని సమీరారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు."తెల్ల జుట్టు గురించి చర్చించాల్సిన అవసరం లేదని నేనంటే.. ఎందుకు అని నాన్న అన్నారు. నాకొక్కదానికే కాదు వయసు పైబడిన ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకలు వస్తాయని చెప్పాను. పాత ఆలోచనలను వీడితేనే.. వయసును అంగీకరించే మార్పు మనలో వస్తుందని చెప్పాను. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాను. తెల్లజుట్టు కవర్ చేసుకున్నంత మాత్రాన కాన్ఫిడెన్స్ రాదని.. అది సహజంగానే వస్తుందని నాన్నకు వివరించాను.

బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. అలాగే ఒక తండ్రిగా నాన్న ఆందోళనను నేనూ అర్థం చేసుకున్నాను. ప్రతిరోజు మనం కొత్త విషయాలు నేర్చుకుంటేనే ముందుకు వెళ్లగలం.. చిన్న మార్పులతోనే మానసిక ప్రశాంతత పొందగలం. ఆ చిన్న మార్పులే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అని సమీరా తెలిపారు. ఆమె ఈ పోస్టుకు ‘యాక్సెప్టెన్స్ ’, ‘హ్యాపీనెస్‘, ‘సెల్ఫ్ లవ్’, అనే ట్యాగ్స్ జోడించారు. మీరు ఎలా ఉన్నా సరే ఆనందంగా ఉండండి అంటూ ఆమె చెప్పకనే చెప్పారు. ఈ 42 ఏళ్ల ముద్దుగుమ్మ కఠిన వ్యాయామాలు చేస్తూ ఇప్పటికీ నిత్య యవ్వనులుగానే కనిపిస్తుంటారు.
Published by:Kiran Kumar Thanjavur
First published: