Oh Baby Teaser Talk: ‘ఓ బేబి’గా అదరగొట్టిన సమంత..

ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

news18-telugu
Updated: May 25, 2019, 4:39 PM IST
Oh Baby Teaser Talk: ‘ఓ బేబి’గా అదరగొట్టిన సమంత..
ఓ బేబీ ఫస్ట్‌లుక్‌లో సమంత Photo: Twitter.com/Samanthaprabhu2
  • Share this:
ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. సమంత ఓల్డ్ లేడీ క్యారెక్టర్ చేసింది. అనుకోకుండా ఆ పెద్దావిడా..పాతికేళ్ల భామగా మారిపోతుంది. ఆమెకు అదెలా సాధ్యమైందనేదే ‘ఓ బేబి’ స్టోరీ. ఈ సినిమాలో ఓల్డ్ లేడీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. యంగ్ పాత్రను సమంత పోషించింది. ఓల్డ్ నుంచి యంగ్ మారడంతో ఏర్పడిన కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో సమంత మరో హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.


First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...