‘ఓ బేబి’గా అక్కినేని కోడలు సమంత సరికొత్త ప్రయోగం..

లాస్ట్ ఇయర్ లాగే ఈ యేడాది కూడా సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.ఈ యేడాది ‘సూపర్ డీలక్స్’, తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేసింది. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ 55వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా  ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: May 22, 2019, 4:16 PM IST
‘ఓ బేబి’గా అక్కినేని కోడలు సమంత సరికొత్త ప్రయోగం..
‘ఓ బేబి’లో సమంత
  • Share this:
లాస్ట్ ఇయర్ లాగే ఈ యేడాది కూడా సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.ఈ యేడాది ‘సూపర్ డీలక్స్’, తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేసింది. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ 55వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా  ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో వైట్ టాప్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని స్మైల్ ఇస్తున్నసమంత వెనక సీనియర్ నటి లక్ష్మి ఉన్న ఫోటో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఆ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: May 22, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading