Samantha : శాకుంతలం సినిమా కోసం సమంత సాహసం.. సినీ కెరీర్‌లో మొదటి సారి అలా చేస్తోన్న అక్కినేని కోడలు.. వివరాల్లోకి వెళితే.. సమంత అక్కినేని తొలిసారి పౌరాణిక సినిమా ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంను స్టోరీనే ‘శాకుంతలం’గా గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. టోటల్ గ్రీన్ మ్యాట్‌లో షూట్ చేస్తోన్న ఈ సినిమాకు గ్రాఫిక్స్‌కు ఎక్కువ కేటాయించాల్సి ఉంది. ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్ర శకుంతల పాత్రలో నటిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సమంత ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటు వంటి సాహసం చేస్తోంది. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలపడం విశేషం.
ఈ సినిమా శకుంతల పాత్ర కోసం సమంత ఆహారం విషయంలో కానీ.. వ్యాయామాల విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అందుకు తగ్గ ప్రతిఫలం తప్పక దక్కుతుందని సమంత చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో యువరాజు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ యాక్ట్ చేస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో అతిథి బాలన్, మల్హోత్ర శివన్, కబీర్ బేడీలు నటించనట్టు సమాచారం. ఈ సినిమాలో నట ప్రపూర్ణ మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా తన సామాజిక మాధ్యమాల్లో అక్కినేని పేరు తొలిగించడంపై పెను వివాదమే సృష్టించింది.
సమంత విషయానికొస్తే.. ‘ఏమాయ చేసావే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తన తొలి చిత్ర హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్.. మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. అక్కినేని హీరోలు హిట్టు కోసం ముఖం వాచిపోతుంటే.. సమంత మాత్రం వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది.
ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. ఇక సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘శాకుంతలం’ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు గుణశేఖర్.. ‘రుద్రమదేవి’ తర్వాత చేస్తోన్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యలో రానాతో హిరణ్య కశ్యప అనుకున్నా కూడా అది పట్టాలెక్కలేదు. ఇపుడు శాకుంతలం సినిమా కంప్లీట్ కానీకొచ్చడంతో త్వరలో హిరణ్య కశ్యప పట్టాలెక్కించనున్నారు. రీసెంట్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో రాజీగా మెప్పించిన విషయం తెలిసిందే కదా. శాకుంతలం తర్వాత సమంత ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఆమె తమిళంలో ‘కాతు వాకుల2 ‘రెండు కాదల్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
HBD Mahesh Babu : తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా..
Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Shaakuntalam, Tollywood