Samantha | సమంత విడాకుల తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. సామ్ విషయానికొస్తే.. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత చైతూకు విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సామ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో సత్తా చూపెడుతోంది. ముఖ్యంగా సమంత.. కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు ఓకే చెప్తున్నారు.
ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే 'యశోద'. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.
August 12th it is!! ?#Yashoda aka @Samanthaprabhu2 is all set to give you thrills n chills in theatres? A @krishnasivalenk's production ?@hareeshnarayan @dirharishankar @varusarath5 @Iamunnimukundan @mynnasukumar @PulagamOfficial @SrideviMovieOff @DoneChannel1 pic.twitter.com/5NGtNAoToi
— BA Raju's Team (@baraju_SuperHit) April 5, 2022
ఈ చిత్రాన్ని ఆగష్టు 12న ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. సామ్ ఇప్పటికే దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్గా సత్తా చూపెడుతునే ఉంది. ఇక గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో సామ్‌కు నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. అందుకే ఇపుడు ఈమె నటించే సినిమాలన్నింటినీ హిందీలో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈసినిమా కోసం సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట.
RRR 11 Days WW Collections : 11వ రోజు ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..
ఈ చిత్రాన్ని బాలయ్యతో ‘ఆదిత్య 369’, వంశానికొక్కడు’, భలేవాడివి బాసు’, మిత్రుడు’ వంటి డిఫరెంట్ సినిమాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు. ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.