Home /News /movies /

SAMANTHA YASHODA HOLLYWOOD ACTION CHOREOGRAPHER YANNICK BEN ROPED IN FOR SAMANTHA LATEST PROJECT YASHODA TA

Samantha : సమంత 'యశోద' మూవీ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..

సమంత ‘యశోద’ కోసం రంగంలోకి  హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ (Twitter/Photo)

సమంత ‘యశోద’ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ (Twitter/Photo)

Samantha | సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో నటిస్తున్న సినిమా ‘యశోద’. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌‌ను రంగంలోకి దిగారు.

    Samantha | సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత చైతూకు విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సామ్ దూకుడు పెంచింది. అంతేకాదు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో సత్తా చూపెడుతోంది. ముఖ్యంగా సమంత..  కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు ఓకే చెప్తున్నారు.

    ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే 'యశోద'. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు .


    'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు 'యశోద' యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.

    RRR : ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్ మరో రికార్డు.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మాస్ సాంగ్..

    హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయని  శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు.  ఈ సినిమా కోసం సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది.  వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్,  రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు. ఇక సమంత నటిస్తున్న ఇతర  సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Samantha Ruth Prabhu, Tollywood, Yashoda Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు