జిమ్‌లో దుమ్ములేపుతున్న సమంత...

Samantha Akkineni :  ఇటీవలే ‘ఓ బేబి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత.. తమిళ సినిమా '96' తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.

news18-telugu
Updated: October 15, 2019, 2:15 PM IST
జిమ్‌లో దుమ్ములేపుతున్న సమంత...
Instagram/samantharuthprabhuoffl
news18-telugu
Updated: October 15, 2019, 2:15 PM IST
Samantha Akkineni :  ఇటీవలే ‘ఓ బేబి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత.. తమిళ సినిమా 96 తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. కాగా ఈ సంవత్సరం సమంత చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.  ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. కాగా సమంత కాస్తా సినిమాలకు విరామం ఇచ్చి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యి.. మంచి హిట్ టాక్ తెచ్చుకోగా.. మొదటి సీజన్‌లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత మరో ప్రధాన పాత్ర పోషించనుంది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు.

జిమ్‌లో సమంత


అది అలా ఉంటే ఎప్పుడూ సూపర్ ఫిట్‌గా ఉంటే సమంత... జిమ్‌లో కష్ట పడుతూ తన శరీర సౌష్టవాన్ని అదుపులో ఉంచుకుంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ మరోసారి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ వావ్ సమంత.. అదరగొడుతున్నావ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఫిట్‌గా ఉండడం కోసం కష్ట పడాల్సిందే.. కష్ట పడడం నిజం అని రాసుకుంది సమంత.






 
Loading...



View this post on Instagram




 

Pc @chayakkineni 💚


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on




First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...