హోమ్ /వార్తలు /సినిమా /

వెంకీమామలో సమంత... ఊహించని విధంగా ఆ పాత్రలో..

వెంకీమామలో సమంత... ఊహించని విధంగా ఆ పాత్రలో..

Instagram

Instagram

విక్టరీ హీరో వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ తెలిసిందే.

విక్టరీ హీరో వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ తెలిసిందే. ఎఫ్ 2 లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకీ నుండి రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.  ఇటీవలే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగ చైతన్యతో రాశీ ఖన్నా రొమాన్స్ చేయనుంది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో సమంత ఓ పాత్రలో చటుక్కున మెరవనుందనేది ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకీ మామ కథలో అతిథి పాత్ర అవసరం రావడం, దీనికితోడు ఆ పాత్ర కూడ కీలక సమయంలో రావడంతో సమంతను ఈ పాత్రకోసం తీసుకున్నారట. దీనికి తోడు సమంతను తీసుకుంటే సినిమాకు ఆమె క్రేజ్ కూడ సినిమాకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో సమంతను తీసుకున్నారట. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా పూర్తిగా వినోదభరితంగా రూపొందించారు. వెంకీమామ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన విడుదల విడుదలకానుంది.









View this post on Instagram





Head Over to @sureshproductions Youtube channel to enjoy the trailer. #VenkyMama #VenkyMamaFromDec13th


A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on



అదిరిన అర్జున్ రెడ్డి భామ హాట్ ఫోటోషూట్..

First published:

Tags: Samantha akkineni, Venky Mama

ఉత్తమ కథలు