Home /News /movies /

SAMANTHA WAS RANKED NUMBER ONE ON THE LIST OF MOST POPULAR HEROINES IN A SURVEY CONDUCTED BY ARMAX MEDIA VB

Samantha: సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! ఏంటంటే..

Samantha (file)

Samantha (file)

Samantha: సమంత, నాగచైతన్య విడాకులు, దానికి గల కారణాలు ఇలా ఎన్నో వార్తలు సమంత గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అభిమానులు వీటి గురించి కాస్త నిరాశలో ఉన్నా.. ఇప్పుడు చెప్పే న్యూస్ తో సంతోషంతో ఎగిరి గంతేస్తారు. అదేంటో తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
  సమంత-నాగచైతన్య.. (Samantha-Nagachaitanya)కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అన్ని బాగుంటే.. ఈ రోజు (అక్టోబర్‌7)వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు. కానీ కొన్ని రోజులు క్రితం చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు. అధికారికంగా భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఎన్నో రోజుల తీవ్రమైన చర్చల తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయింది సమంత. ఇకపై భర్త నాగ చైతన్యతో తాను విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

  Samantha: సమంత మరో సంచలన పోస్టు.. మగాళ్లు ఆ తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించరంటూ..


  ఇకపై ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు అభిమానులతో అసలు విషయం పంచుకుంది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు తమ నిర్ణయంపై ప్రైవసీ పాటించాల‌ని కోరింది. దీనిపై నాగార్జున కూడా భావోద్వేగంతో ట్వీట్ చేశారు. “బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా, సమంత, నాగ చైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేది వ్యక్తిగతం, వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైన వాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగ చైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా” అని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ఈ విషయాలు అన్నీ తెలిసినవే. అయితే ఎందుకు వీరిద్దరు విడిపోతున్నారనే కారణాలతో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వివిధ రకాల కారణాలతో .. విడిపోయేందకు ఇదే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు.

  Suma-Rajeev Kanakala: రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త అలాంటి వాడే అంటూ..


  అందులో కొన్ని వార్తలకు సమంత తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య నుంచి ఎటువంటి సమాధానం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేయలేదు. సమంత నిన్న మరో పోస్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఆడవాళ్లు తప్పు చేస్తే నైతికంగా ప్రశ్నించే వారు.. మగాళ్లు తప్పుచేసినా ప్రశ్నించాలి’’ అంటూ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఆమె ఎంతో భావేద్వేగంతో ఆ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత అభిమానులకు ఇప్పుడు చెప్పే వార్త ఒక పండగ లాంటిది. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్న సమంత వృత్తి పరంగా మాత్రం దూసుకుపోతుందనే చెప్పాలి. ఎందుకంటే.. హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

  Chaitanya Samantha Divorce: అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న బ్రేకప్ లు, విడాకులు.. ఎందుకిలా..


  అలాగే ఎంతో మంది అభిమానులను కూడా ఆమె సంపాదించుకున్నారు. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరుగా నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్‌ ఫామ్‌ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆమె ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. విడాకుల తర్వాత కూడా ఆమె మొదటి స్థానం దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయమే. చూడాలి మరి ఆ స్థానం ఎంతకాలం కొనసాగుతుందో.
  Published by:Veera Babu
  First published:

  Tags: Akkineni samantha, Samantha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు