పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా 'ఖుషీ'(Kushi). ఈ సినిమా అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపింది. 2001లో రిలీజ్ అయిన ఖుషీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను తమిళ్ మూవీకి రిమేక్. ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య డైరెక్షన్లో ఖుషీ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్. 'ఖుషీ' సినిమాలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పెర్ఫార్మన్స్, ఆయన కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్గా నటించిన భూమిక కూడా ఈ సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఖుషీ సినిమా(Kushi songs) పాటలు కూడా ఎంతగానే హిట్ అయ్యాయి. అప్పట్లో ఏ ఇంట్లో చూసినా ఈ పాటలే వినిపించేవి. మణిశర్మ(Mani Sharma) ఈ సినిమాకు సంగీతం అందిచారు.
ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌తో మరో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాణ(Siva Nirvana).. తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో(Vijay Devarakonda) చేయనున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ- సమంత కాంబినేషన్ లో సినిమా అనేసరికి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరూ కలిసి 'మహానటి'(Mahanati) సినిమాలో జోడీగా కనిపించారు. అయితే తెరపై కనిపించేది కాసేపే. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాకి 'ఖుషీ' (Kushi)అనేది వర్కింగ్ టైటిల్. మరి ఈ టైటిల్ ను పర్మినెంట్ చేస్తారా..? లేక మరో టైటిల్ పెడతారో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ నెలలలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఎనభై రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ శివ నిర్వాణ. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కశ్మీర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండ 'లైగర్' (Liger)సినిమాను పూర్తి చేసి ఇప్పుడు 'జేజీఎం' అనే మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో నటిస్తూనే.. శివ నిర్వాణ షూటింగ్ లో పాల్గొనున్నారు విజయ్ దేవరకొండ.మరి పవన్ కళ్యాణ్ ఖుషీ టైటిల్ వీరికి కూడా మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.