విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్వకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫస్ట్ లుక్‌ను మరో రెండు రోజుల్లో మే 16న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతా అనుకున్నట్లే ఈ సినిమాకు ఖుషి టైటిల్ ఇచ్చారు. తాజాతా సినిమా పేరుతో పాటు.. రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు మేకర్. అంతే కాదు క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 23న ఖుషి సినిమా విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల కాశ్మీర్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ ప్రారంభమైంది. ఆ సెట్లోనే సమంత బర్త్‌డేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ‘ఖుషి’ టైటిల్ ని వాడేశారు. విజయ్ దేవరకొండ, సమంత సినిమాకి ‘ఖుషి’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు.
This Christmas- NewYears ❤️
An Explosion of Joy, laughter, happiness & Love.
A Grand Family experience!💕#KUSHI
Telugu Tamil Kannada Malayalam
Dec 23 Worldwide Release!@TheDeverakonda @ShivaNirvana @MythriOfficial pic.twitter.com/35IXI9jsI4
— Samantha (@Samanthaprabhu2) May 16, 2022
సమంత సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ వాడేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా ఖుషి సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కశ్మీర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండ 'లైగర్' (Liger)సినిమాను పూర్తి చేసి ఇప్పుడు 'జణగణమణ' అనే మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో నటిస్తూనే.. శివ నిర్వాణ షూటింగ్ లో పాల్గొనున్నారు విజయ్ దేవరకొండ.మరి పవన్ కళ్యాణ్ ఖుషీ టైటిల్ వీరికి కూడా మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Samantha Ruth Prabhu, Siva nirvan, Vijay Devarakonda