విజయ్ దేవరకొండ ఇటీవలే.. లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేదు. అయితే విజయ్, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్వకత్వంలో ఖుషీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుతో పాటు.. రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. అంతే కాదు క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 23న ఖుషి సినిమా విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ కాదని... వచ్చే ఏడాది జాన్ లేదా ఫిబ్రవరిలో ఉంటుందని ఓ వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది కూడా మారినట్టు తెలుస్తోంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఖుషీ సినిమా ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఖుషీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాశ్మీర్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ ప్రారంభమైంది. ఆ సెట్లోనే సమంత బర్త్‌డేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ‘ఖుషి’ టైటిల్ ని వాడేశారు. విజయ్ దేవరకొండ, సమంత సినిమాకి ‘ఖుషి’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు.
అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా ఖుషి సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కశ్మీర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సమంత నటించిన యశోద సినిమా కూడా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాను సరోగసి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు, యాక్షన్ థ్రిల్లర్‌గా యశోద సినిమా తెరకెక్కించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.