SAMANTHA VIJAY DEVARAKONDA CHIT CHAT WITH SAM JAM PROGRAMME IN AHA ORIGINAL TA
Samantha-Vijay Devarakonda:సామ్ జామ్ కోసం విజయ్ దేవరకొండతో సమంత ఫన్నీ చిట్‌చాట్..
సామ్ జామ్‌లో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేసిన సమంత (Twitter/Photo)
Samantha-Vijay Devarakonda | సమంత అక్కినేని కోడలైన తర్వాత ఈమె దూకుడు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలు..మరోవైపు ఫ్యామిలీకి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా సమంత ఆహా ఫ్లాట్‌ఫామ్ కోసం యాంకర్ అవతారం ఎత్తింది. అందులో విజయ్ దేవరకొండను ఫన్నీగా ఇంటర్వ్యూగా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha-Vijay Devarakonda | సమంత అక్కినేని కోడలైన తర్వాత ఈమె దూకుడు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలు..మరోవైపు ఫ్యామిలీకి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. మ్యారేజ్ తర్వాత కూడా సమంత సక్సెస్ రేట్ కూడా పెరిగింది. ఇపుడు ఈమె ఆహా ఫ్లాట్‌ఫామ్ కోసం హోస్ట్‌గా వ్యవహరించబోతుంది. అంతేకాదు హోస్ట్‌గా పలువురు సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలను చేయనుంది. ఈ షో నవంబర్ 13న దీపావళి కానుకగా ప్రీమియం కానుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో సమంత మొదట.. విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయనుంది.కొంత మంది ప్రేక్షకుల సమక్షంలో విజయ్ దేవరకొండను సమంత ఇంటర్వ్యూ చేయనుంది. మాములు ఇంటర్వ్యూలో తరహాలో కాకుండా కాస్త వెరైటీగా ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసినట్టు కనపడుతోంది. బాలీవుడ్లో కాఫీ విత్ కరణ్ తరహాలో ఉంది. కానీ సామ్ జామ్‌లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రేక్షకులతో ఆటా పాటా ఆడించి వారికి గిప్ట్‌లు కూడా ఇస్తున్నారు. ఇది మాత్రం కాస్త వెరైటీగా ఉంది. ఈ నెల 13న ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ కానుంది. ఎంతో ఫన్నీగా ఈ షోలో సమంత, విజయ్ దేవరకొండ అదరగొట్టేసారు. ఇక వీళ్లిద్దరు కలిసి ‘మహానటి’ జోడిగా నటించిన సంగతి తెలిసిందే కదా.
సమంత విషయానికొస్తే.. ఈమె తన స్నేహితురాల్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. అంతేకాదు రీసెంట్గా మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది.హోస్ట్‌గా మామకు తగ్గ కోడలిగా సమంత అదరగొట్టింది. వచ్చిన తెలుగుతో ఎక్కడా తడబడకుండా సమంత ఆకట్టుకుంది. దసరా స్పెషల్‌గా వచ్చిన సమంత తన యాంకరింగ్‌తో శభాష్ అనిపించుకుంది. అంతేకాకుండా గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ కు మంచి టీఆర్పీనే వస్తుంది అంతా అనుకున్నారు. ఇప్పుడు అలా అనుకున్నట్టుగానే 11.4 గట్టి టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం తెగ సంబరపడిపోతుంది.
సమంత Photo : Twitter
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఆ మధ్య శర్వానంద్‌తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఓ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్ అశ్విన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.