"యు టర్న్" ప్రివ్యూ... చైతూ కంటే త‌క్కువే..

సెన్సార్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్‌గా ఉండ‌టంతో సినిమా యూనిట్ కూడా ప్ర‌శాంతంగానే ఉన్నారు. మ‌రోవైపు ఈ చిత్రం బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లో స‌మంత మేనియాతో 8.8 కోట్ల‌కు అమ్మారు సినిమాను. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇది చాలా ఎక్కువ‌. ఇక త‌మిళ్‌తో కూడా క‌లిపి బిజినెస్ 16 కోట్ల‌కు చేరిపోయింది. ముఖ్యంగా త‌మిళ‌నాట 3.5 కోట్లు.. ఓవ‌ర్సీస్ లో 2.2 కోట్లకు అమ్ముడైంది "యు ట‌ర్న్" రైట్స్.

news18-telugu
Updated: September 12, 2018, 8:11 PM IST
యూ టర్న్ పోస్టర్..
  • Share this:
స‌మంత తొలిసారి లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లో న‌టించిన సినిమా "యు ట‌ర్న్". ఈ చిత్రం మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్.. ట్రైల‌ర్స్.. ప్రోమోస్ అన్నీ ఈ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు సినిమా వ‌చ్చి బాక్సాఫీస్‌ను క‌దిలించ‌డం మాత్ర‌మే మిగిలింది. సెన్సార్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్‌గా ఉండ‌టంతో సినిమా యూనిట్ కూడా ప్ర‌శాంతంగానే ఉన్నారు. మ‌రోవైపు ఈ చిత్రం బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది.

"యు టర్న్" ప్రివ్యూ... చైతూ కంటే త‌క్కువే.. samantha u turn pre release business..
యు టర్న్ పోస్టర్

తెలుగు రాష్ట్రాల్లో స‌మంత మేనియాతో 8.8 కోట్ల‌కు అమ్మారు సినిమాను. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇది చాలా ఎక్కువ‌. ఇక త‌మిళ్‌తో కూడా క‌లిపి బిజినెస్ 16 కోట్ల‌కు చేరిపోయింది. ముఖ్యంగా త‌మిళ‌నాట 3.5 కోట్లు.. ఓవ‌ర్సీస్ లో 2.2 కోట్లకు అమ్ముడైంది "యు ట‌ర్న్" రైట్స్. స‌మంత ఈ చిత్రంలో అద్బుతంగా న‌టించింద‌ని.. ఆమె పాత్రే సినిమాకు ప్రాణం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.

"యు టర్న్" ప్రివ్యూ... చైతూ కంటే త‌క్కువే.. samantha u turn pre release business..
యూటర్న్ మూవీలో సమంత (ట్విట్టర్ ఫోటో)

"యు ట‌ర్న్" చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్‌లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. ఇక సెప్టెంబర్ 13నే సమంత తమిళ్లో శివకార్తికేయన్‌తో నటించిన "సీమరాజా" కూడా విడుదల కానుంది.


"యు టర్న్" ప్రివ్యూ... చైతూ కంటే త‌క్కువే.. samantha u turn pre release business..
సమంత ట్విట్టర్ ఫోటోస్

తెలుగులో "యు టర్న్" సినిమాతో వస్తుంది. ఈ సినిమాను శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు "యుట‌ర్న్" చిత్రాన్ని నిర్మించారు. భ‌ర్త నాగ‌చైత‌న్య "శైల‌జారెడ్డి అల్లుడు"కు పోటీగా ఈ చిత్రం వ‌స్తుంది. క‌చ్చితంగా ఈ చిత్రంతో స‌మంత సోలో హీరోయిన్‌గానూ స‌త్తా చూపించాల‌ని చూస్తుంది. స‌మంత ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ 500 థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది ఈ చిత్రం. దానికి త‌గ్గ‌ట్లుగానే భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ భార్యాభ‌ర్త‌ల పోరులో ఎవ‌రు గెలుస్తారో..?
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...