ఈ యేడాది..‘రంగస్థలం’, ‘మహానటి’ సక్సెస్‌లతో సమంత ఫుల్ జోష్‌లో వుంది. మరోవైపు విశాల్ హీరోగా తెరకెక్కిన డబ్బింగ్ మూవీ ‘అభిమన్యుడు’తో మరో హిట్టును ఆమె ఖాతాలో వేసుకుంది. వరుస సక్సెస్‌లతో దూకుడు మీదున్న ఈ చుల్బులి ఇపుడు కన్నడ సూపర్ హిట్ ‘యూ టర్న్’ తెలుగు, తమిళ రీమేక్‌లో నటిస్తూ నిర్మిస్తోంది.
కన్నడ ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమారే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇపుడీ మూవీలో సమంత తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. అంతేకాదు వచ్చే వారంలో ఆమె పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలుపెట్టే అవకాశం వుంది.
రీసెంట్గా ‘మహానటి’ కోసం ఫస్ట్‌టైమ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది సమంత. ఈమూవీలో సామ్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. లేటెస్ట్గా ‘యూటర్న్’ మూవీలో సమంత మరోసారి జర్నలిస్ట్ పాత్రను పోషించడం విశేషం. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఆగష్టు చివరి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 29, 2018, 13:22 IST