స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరిగా మారింది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత చేసిన పోస్టులపై ఫ్యాన్స్ సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. సమంత ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్లు చేసింది? సమంతకు కోపం వచ్చిందా? ఆ కోపం తెచ్చిన వారు ఎవరై ఉంటారా అన్న కోణంలో జోరుగా మాట్లాడుకుంటున్నారు. సమంత తాజాగా తన ట్విట్టర్ లో ఓ సీరియస్ ట్వీట్ పెట్టింది. దీంతో సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
సమంత చేసిన ట్వీట్ చూస్తే.. ‘నా మౌనం అజ్ఞానం అని, నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని, నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది. ఇప్పుడు సమంత చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అని తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా సమంతని ట్రోల్ చేశారా? లేక సమంతని ఎవరైనా ఏమన్నా అన్నారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.
The Actual Pooja photo! With the darlings @Samanthaprabhu2 @vennelakishore @eyrahul
Request the press to share the actual photo :) thank you. pic.twitter.com/Fz3bfVCIK2
— Vijay Deverakonda (@TheDeverakonda) April 21, 2022
సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇలా పోస్ట్ చేసిన వెంటనే సమంత మరో పోస్ట్ వేసింది. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్ జరుగుతోంది. అటు ఫ్యాన్స్ కూడా దీనిపై స్పందిస్తున్నారు. సమంత ట్వీట్ ని మరింత షేర్ చేసి సమంతతో జాగ్రత్త అంటూ పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. మరి సమంత ఇంత సీరియస్ గా ట్వీట్ ఎందుకు చేసిందో అంటూ మాట్లాడుకుంటున్నారు.
అయితే సమంత ట్వీట్‌కు రెండు రకాల రీజన్స్ చెబుతున్నారు నెటిజన్స్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే సమంత మాత్రం ఇక్కడ కనిపించకుండా పోయింది.
దీంతో హీరో విజయ్ దేవరకొండ.. సామ్ ఫోటోను మార్ఫింగ్ చేసి పూజా కార్యక్రమానికి హాజరైనట్లు చూపించి ఫ్యాన్స్‌కు షేర్ చేశాడు. ఈ ఫోటోను వైరల్ చేయాలని కోరాడు. విజయ్ చేసిన ఈ పనికి సమంత సీరియస్ అయ్యిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే విజయ్ పోస్టుకు ఆ తర్వాత సమంత స్పందించింది. ట్విట్టర్ వేదికగా రిప్లయ్ ఇచ్చిన సమంత.. రాలేకపోయినందుకు బాధపడుతున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో విజయ్ పై సమంత సీరియస్ కాలేదని తేలిపోయింది. సమంత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌లో ఉంది. ఈ కారణంగానే మూవీ లాంచ్ ఈవెంట్‌కు ఆమె రాలేదని సమాచారం.
మరోవైపు సమంత సీరియస్ అవ్వడానికి మరో రీజన్ కూడా చూపిస్తున్నారు నెటిజన్స్. విడాకుల తర్వాత సమంతని ట్రోల్ చేసే వారే ఎక్కువగా పెరిగారు. విడాకుల తర్వాత సమంత రెచ్చిపోయి బోల్డ్ ఫోటోలు దిగడం, ఐటెం సాంగ్స్ చేయడం లాంటివాటితో ఈ ట్రోల్స్ మరింత పెరిగాయి. అప్పుడప్పుడు ఈ ట్రోల్స్ కి ఘాటుగానే స్పందిస్తుంది సమంత. ఈ క్రమంలోనే తమిళ్ హీరో విజయ్ సేతుపతితో సమంత ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో సమంత బోల్డ్ లుక్‌పై ట్రోలింగ్ విషయంలోనే సమంత ఇలా స్పందించిందని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద సమంత ఎవరికి ఇచ్చిందో కానీ.. కాస్త ఘాటుగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Samantha Ruth Prabhu, Vijay Devarakonda