స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) లీడ్ రోల్ పోషించిన సినిమా శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా వెనక్కి తగ్గారు. సినిమా రిలీజ్ మరోసారి వాయిదా వేస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయమై సమంత క్రేజీ రియాక్షన్ ఇచ్చింది.
శాకుంతలం రిలీజ్ వాయిదా అని చెప్పిన యూనిట్.. కొత్త విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాాచారం మేరకు ఏప్రిల్ 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. శాకుంతలం వాయిదా పడిందని తెలిసి సమంత ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా అందరిలో ఉత్సాహం నింపేలా సమంత ట్వీట్ పెట్టింది.
శాకుంతలం వాయిదా పడినందుకు ఎవ్వరూ నిరాశ చెందొద్దని సమంత చెప్పింది. ఎప్పుడొచ్చినా ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నట్లుగా పేర్కొంటూ ప్రామిస్ కూడా చేసింది. దీంతో శాకుంతలంపై సమంతకున్న కాన్ఫిడెన్స్ ఏంటనేది అందరికీ అర్థమైంది. సమంత ఫీలింగ్స్ చూసి ఈ సినిమా సూపర్ సక్సెస్ ఖాయమే అని ఆమె ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.
I promise you it will be worth it ????#Shaakuntalam https://t.co/1fdSpgHRvy
— Samantha (@Samanthaprabhu2) February 7, 2023
ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత కెరీర్ లో వస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. నీలిమ గుణ, దిల్ రాజు (Dil Raju) నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా ఈ సినిమాతో మొదటిసారి కెమెరా ముందుకొస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. శాకుంతలంపై సామ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.