పుష్ప సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప: ద రూల్’గా సెకండ్ పార్ట్ రానుంది. పుష్ప్ పార్ట్ 2పై బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఎండింగ్ ఇంట్రస్టింగ్‌గా పెట్టారు డైరెక్టర్. పార్ట్ వన్‌లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప రోల్ ప్లే చేసిన అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తర్వాత ఎంచెక్కా వచ్చి పెళ్లి పీటలపై కూర్చొని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ తరువాత ఏమవుతుంది? అనేది పార్ట్ టూలో మనం చూడొచ్చు. దీంతో ఇప్పుడు పుష్ప 2 కోసం అంతా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
అయితే అదే సమయంలో పుష్ప సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా ఊహూ అంటావా మావా అనే పాటతో సమంత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరొందిన సుకుమార్ ‘పుష్ప’ మొదటి భాగంలో సమంతతోనే ఐటమ్ చేయించాడు. ఇప్పటి వరకు ఈ సాంగ్‌కు 200 మిలియన్స్ వ్యూస్ సాధించింది. అయితే అదే స్టైల్లో ‘పుష్ప’ రెండో భాగంలోనూ మరో ఐటమ్ సాంగ్ తెరకెక్కనుందని సమాచారం. అదే ఇప్పుడు హాట్ ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, ‘పుష్ప’ రెండో భాగంలోనూ ఐటమ్ సాంగ్ లో సమంతనే అల్లు అర్జున్ తో చిందేయనుందని సమాచారం.
సమంత ఐటమ్ సాంగ్ ఉందని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సమంత అభిమానులు కూడా ఇప్పుడు దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఈసారి సమంత ఎలా తన కనువిందు చేయనుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిక పుష్ప 2పై ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సమంత ఐటమ్ సాంగ్ ఉందని తెలియడంతో ఈ మూవీపై అంచానలు మించిపోతున్నాయి.
టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా సమంత బిజీగా మారిన విషయం తెలిసిందే.
నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత చేసిన తొలి ఐటమ్ సాంగ్ పుష్ప కావడం విశేషం. ఇప్పుడు మరోసారి సామ్ ఐటెం సాంగ్ చేయనుండటంతో దీనిపై టాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా బిజీగా మారింది సామ్. అక్కడ రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పింది. దీంతో ముంబైలో సామ్ సొంత ఇల్లు కూడా కొంటుందని సమాచారం. అక్కడే ఉంటూ.. బాలీవుడ్లో తన అదృష్టి పరీక్షించుకోనుంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.