లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు నేటి తరం హీరోయిన్స్‌లో కొందరు మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా మారారు. మహిళా చిత్రాలను అలాంటి హీరోయిన్స్‌తోనే చేయడానికి మన దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కొద్ది మంది హీరోయిన్స్‌లో సమంత అక్కినేని ఒకరు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలున్న సినిమాలనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన సమంత. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌తో పాటు, డిఫరెంట్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. తాజాగా ఈమె మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. సినిమాలను గ్రాండ్‌గా తెరకెక్కించే దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్ ఇప్పుడు 'శాకుంతలం' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. 'శాకుంతలం' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పౌరాణిక గాథ అయిన దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమాను గుణశేఖర్ అనౌన్స్ చేసిప్పటి నుండి శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు సమంత అక్కినేని ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట. మరి దుష్యంతుడుగా ఎవరు నటిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.
శాకుంతలం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి మొదటి వారం నుండి ఇస్తామంటూ గుణశేఖర్ అండ్ టీమ్ ప్రకటించింది. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితగాథను తెరకెక్కించిన తర్వాత గుణశేఖర్.. హిరణ్య కశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని రానా దగ్గుబాటితో తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. స్టోరీ డిస్కషన్స్, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉండటంతో గుణశేఖర్ 'శాంకుతలం' చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మహాకవి కాళిదాసు రాసిన శాకుంతలం నాటకం .. వెస్ట్రన్ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. అంతేకాదండోయ్ 1889లో ఈ నాటకాన్నినార్వేజియన్, ఫ్రెంచ్, ఆస్ట్రియన్, ఇటాలియన్ వంటి 46 భాషలలోకి అనువాదం చేశారు. ఇప్పుడు ఈ నాటకాన్నే గుణశేఖర్ దృశ్య కావ్యంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు.
పెళ్లి తర్వాత డిఫరెంట్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సమంత..మరి ఇలాంటి పౌరాణిక పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందనేది అందరిలోనూ మెదులుతున్ర ప్రశ్న. దుష్యంత మహారాజుగా నటించేది ఎవరో తెలియాలంటే కూడా వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gunasekhar, Samantha, Samantha akkineni