తెలుగులో సమంత తాజా సినిమా జాను. తమిళ సూపర్ హిట్ సినిమా 96కు రీమేక్‌గా వచ్చిన ఆ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేపోయింది. దీంతో ఆమె కొంత గ్యాప్ తీసుకుని ఓ మంచి కథ కోసం ఎదురు చూస్తోంది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఆమె ఓ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ చూస్తోందట. ఇటీవల ఆమె దియా అనే కన్నడ సినిమా చూసిందట. ఆ సినిమా నచ్చడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ చూస్తోందట. సమంత గతంలో 'యు టర్న్', 'ఓ బేబీ', తాజాగా 'జాను' వంటి రీమేక్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కన్నడలో లోబడ్జెట్‌లో రూపొందిన 'దియా' చిత్ర రీమేక్ రైట్స్‌ని ఓ పెద్ద నిర్మాత భారీ ఆఫర్‌తో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని ఆయన సమంతతో చేయాలని అనుకుంటున్నాడట. దీంతో త్వరలోనే ఈ రీమేక్ సినిమా మీద క్లారిటీ రానుంది. ఈ కన్నడ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారనే విషయం కూడా త్వరలో తేలనుంది. మరోవైపు సమంత సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రముఖ కర్నాటక గాయని, మహిళా స్వాతంత్య్ర యోధురాలు బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో సమంత బెంగుళూరు నాగరత్నమ్మగా నటించనుందని తెలుస్తోంది.
మరో వార్త ఏమంటే సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరి అభిమానులు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమానే కన్నడ దియా అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. అయితే ఆ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం మెండుగా ఉంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.