Samantha - The Family Man 2: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే.. సమంత ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. గతంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎపుడు విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్ ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత LTTE టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుంది. దీనిపై తమిళ ఆడియన్స్ నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. పుట్టుకతో తమిళురాలైన సమంత.. ఇలాంటి పాత్రలో కనిపిస్తుండంతో తమిళ ఆడియన్స్‌ను ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపు నిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్‌లో LTTE ని టెర్రరిస్ట్ సంస్థగా చూపించడమే తమిళుల ఆగ్రహానికి గురైంది. LTTE అనేది శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన సంస్థ అని వాదిస్తున్నారు. అంతేకానీ.. అదో ఉగ్రవాద సంస్థ కాదంటున్నారు. అలాంటి తమిళ టైగర్స్‌ను టెర్రరిస్టులుగా చూపిస్తారా అని తమిళ జనాలు మండిపడుతున్నారు. ఈ విషయమై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ.. ఐటీ మినిష్టర్ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ రాసారు. ఈ వెబ్ సిరీస్‌లో తమిళ సంప్రదాయాలను కించ పరిచే కంటెంట్‌ను అనుమతించక పోవడమే ఉత్తమం అంటూ లేఖలో పేర్కొన్నారు.
Tamil Nadu IT Minister wrote to Union Minister Prakash Javadekar requesting to take immediate action either to stop or ban the release of 'The Family Man-2' series on OTT platform Amazon Prime pic.twitter.com/UyWUtRrgG1
— ANI (@ANI) May 24, 2021
ఈ లేఖలో ఉన్న విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర సమాచార శాఖ నుంచి సమాధానం వచ్చింది. తమిళుల మనోభావాలను దెబ్బ తీసే ఇలాంటి వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఎండీఎంకే సెక్రటరీ జనరల్ వైగో ఓ ప్రకటనలో తెలిపారు.
మొత్తంగా సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న సమంతకు ఇపుడు తమిళ ఆడియన్స్‌ను ట్రోల్స్ ఎదురుకావడంతో కాస్తంత ఇబ్బంది పడుతోంది. మొత్తంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురైన ఈ వెబ్ సిరీస్‌కు ఇపుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై నేపథ్యంలో సాగనుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్లో మనోజ్ బాజ్ పాయ్ అదరగొట్టారు. ఇక ఈ సీజన్లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. అసలు ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత ఓ టెర్రిరిస్టు లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్.
ఈ కొత్త సీజన్ వచ్చే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో వచ్చే రెండవ సీజన్‌పై మంచి అంచనాలున్నాయి. సమంత ఈ వెబ్ సీరీస్‌లో రాజీ పాత్రలో కనిపించనుంది. ఈ సీజన్ ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని అనుసరించి ఇందులో LTTE పాత్రను తొలిగిస్తారా లేదా అనేది చూడాలి. ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Kollywood, Prakash Javadekar, Samantha akkineni, Tamil nadu, Tollywood