Samantha : పండగ రోజున అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత..

సమంత అక్కినేని (Twitter/Photo)

Samantha : పండగ రోజున అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. 

 • Share this:
  Samantha : పండగ రోజున అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.  పెళ్లై నాలుగో వివాహా వార్షికోత్సవం జరుపుకుంటారనున్న అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చి వీళ్లిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు.  తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఏ క్షణమైతే ఆమె నాగచైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

  పెళ్లి తర్వాత సమంత బాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ కానున్నట్టు సమాచారం. ఇక నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించాకా ఆమె సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ దసరా పండగ సందర్భంగా గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది.

  NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

  మరోవైపు సమంత, నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటంచిన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనుంది. అంతేకాదు సమంత తను చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేవలం తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

  సమంత విషయానికొస్తే..  దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరుగా నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్‌ ఫామ్‌ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

  Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  రీసెంట్‌గా సమంత.. ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. విడాకుల తర్వాత కూడా ఆమె మొదటి స్థానం దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయమే. చూడాలి మరి ఆ స్థానం ఎంతకాలం కొనసాగుతుందో. మొత్తంగా సమంత పెళ్లి తర్వాత సినిమాల విషయంలో అమలా పాల్ లాగా దూకుడు పెంచాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: