హోమ్ /వార్తలు /సినిమా /

Samantha : పెళ్లిలో ధరించిన చీర విషయంలో సమంత అనూహ్య నిర్ణయం.. షాక్‌లో అభిమానులు..

Samantha : పెళ్లిలో ధరించిన చీర విషయంలో సమంత అనూహ్య నిర్ణయం.. షాక్‌లో అభిమానులు..

Samantha | సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సమంత తన పెళ్లి చీర విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Samantha | సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సమంత తన పెళ్లి చీర విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Samantha | సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సమంత తన పెళ్లి చీర విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

  Samantha | సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న   విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే (Yeh Maaya Chesave) చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దీంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించారు. అయితే 2015లో నాగ చైతన్య బర్త్‌ డే రోజు విష్ చేస్తూ సమంత (Samantha) చేసిన ట్వీట్.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి తెర తీసింది. ఆ ట్వీట్‌లో సమంత.. నా అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొనడం పెద్ద సంచలనమైంది.  ఇందుకు చైతన్య.. సామ్ ముద్దు పేరు పాపా ను పేర్కొంటూ రిప్లై ఇచ్చాడు.

  ఇక, కొంతకాలం సమంత, నాగ చైతన్య రిలేషన్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వాళ్లు కలిసి కనిపించడంతో.. ఆ ప్రచారానికి బలం చేకూరింది. చివరకు తాము ప్రేమలో ఉన్నట్టుగా చైతన్య, సమంతలు అంగీకరించారు. ఈ విషయం చైతన్య ఇంట్లో మొదట తన తండ్రి నాగార్జునకు చెప్పినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. చైతన్య, సమంతలు.. 2017లో గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

  Tollywood Top10 Highest Screens Count : టాలీవుడ్‌లో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు.. రాధే శ్యామ్ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

  అయితే నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ముఖ్యంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకల్లో సమంత ధరించిన చీరల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిశ్చితార్థం రోజున సమంత కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ రూపొందించారు. నాగచైతన్యతో పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు నిశ్చితార్థం వరకూ వారి మధ్య జరిగిన అందమైన అనుభూతులను బొమ్మల రూపంలో చీరపై డిజైన్ చేశారు.

  పెళ్లికి కూడా క్రేశా బజాజ్‌.. ప్రత్యేకంగా చీర, లెహంగాలను డిజైన్ చేశారు. అయితే పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర.. నాగ చైతన్య అమ్మమ్మ రామానాయుడు భార్యగారైన దగ్గుబాటి రాజేశ్వరిది. ఆ చీరను రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత ధరించింది. ఇందుకోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని టాక్. విడాకుల తర్వాత సమంత .. నాగ చైతన్యకు సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ కోవలోనే సమంత పెళ్లిలో ధరించిన నాగ చైతన్య అమ్మమ్మ వాళ్ల చీరను వాళ్లకే తిరిగి ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె శాకుంతలం, యశోదా సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

  First published:

  Tags: Naga Chaitanya Akkineni, Samantha Ruth Prabhu, Shakuntalam Movie, Tollywood

  ఉత్తమ కథలు