హోమ్ /వార్తలు /సినిమా /

Samantha as Yashoda: సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు..

Samantha as Yashoda: సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు..

పాన్‌ ఇండియన్ ప్రాజెక్టులతో పిచ్చెక్కిస్తుంది స్యామ్. అందులో భాగంగానే ‘యశోద’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శక ద్వయం హరి, హరీశ్‌ తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నిర్మాత శివలెంత కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం సమంత చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. మేకోవర్ కూడా అవుతుంది.

పాన్‌ ఇండియన్ ప్రాజెక్టులతో పిచ్చెక్కిస్తుంది స్యామ్. అందులో భాగంగానే ‘యశోద’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శక ద్వయం హరి, హరీశ్‌ తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నిర్మాత శివలెంత కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం సమంత చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. మేకోవర్ కూడా అవుతుంది.

Samantha as Yashoda: సమంత (Samantha as Yashoda) వరస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటున్నారు స్యామ్. ఈ క్రమంలోనే మరో సినిమాకు సైన్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై యశోద అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తుంది స్యామ్.

ఇంకా చదవండి ...

సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటున్నారు స్యామ్. ఈ క్రమంలోనే మరో సినిమాకు సైన్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియ‌ల్‌కు త‌గ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం.

Balakrishna as Villain: విలన్‌గా నటించడానికి రెడీ.. కథలున్నాయా.. దర్శకులకు బాలయ్య సవాల్..


డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు" అని చెప్పారు. తమిళంలో 'మైనా', 'కుంకీ', 'గీతు'... తెలుగులో 'చిలసౌ', 'రిపబ్లిక్' తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సమంతతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పాన్ ఇండియన్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు సమంత. అన్ని భాషల్లో ఇమేజ్ సంపాదించడానికి ఇదే మంచి ప్రయత్నం అంటున్నారు స్యామ్. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో పాటు తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సమంత.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha Ruth Prabhu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు