హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: అదిరే ఆఫర్ కొట్టేసిన సమంత.. బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా

Samantha: అదిరే ఆఫర్ కొట్టేసిన సమంత.. బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా

ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరోతో సమంత సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మరో బిగ్ స్టార్‌తో కూడా సమంత సినిమా చేసేందుకు సంతకం చేసినట్లు సమాచారం.

  టాలీవుడ్‌కు చెందిన ఎందరో హీరోయిన్లు బాలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటుకున్నారు. శ్రీదేవి,జయప్రద,భాను ప్రియ హింది సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఇప్పటి హీరోయిన్లు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇలియానా, కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే...ఇటు తెలుగు సినిమాలు చేస్తూ.. అటు బాలీవుడ్‌లో కూడా చిత్రాలు తీశారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. తెలుగు,తమిళ్,కన్నడ సినిమాల్లో ఫుల్ బిజీగా మారిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా దూసుకెళ్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఇప్పటికే ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన సమంత ఇప్పుడు ఒక సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.

  స్టార్ నటి సమంత బాలీవుడ్ కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసిందని సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. నటీనటులు, మూవీ టీంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లాక్ బస్టర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కనిపించిన సమంత ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు దగ్గరయిన విషయం తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కూడా సమంత సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ఇటీవలే సామ్ వరుణ్ ధావన్‌తో ముంబయ్‌లో సందడి చేసింది. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అయితే వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. షూటింగ్ కోసం ఇప్పటికే మేకర్స్ ఏర్పాట్లు కూడా షురూ చేశారట. జులై నెలలో షూటింగ్‌ను ప్రారంభించి నాలుగు లేదా అయిదు నెలల్లోనే షూటింగ్‌ను ముగించేలా ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు సమంత నటిస్తున్న శకుంతలం, యశోద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అవి మాత్రమే కాకుండా తమిళంలో ఒక సినిమాను చేసిన ఈ అమ్మడు మరో వైపు తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాను చేయబోతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు.

  First published:

  Tags: Akshay Kumar, Bollywood news, Samantha Ruth Prabhu, Samantha twitter

  ఉత్తమ కథలు