Home /News /movies /

SAMANTHA SHOULD BE CREDITED AS GUNASEKHAR JOINS FORCES WITH DIL RAJU MHN

Samantha Akkineni: గుణ శేఖర్ తో చేతులు కలపనున్న దిల్ రాజు...క్రెడిట్ మాత్రం సమంతదే

Samantha should be credited as Gunasekhar joins forces with Dil Raju

Samantha should be credited as Gunasekhar joins forces with Dil Raju

Samantha Akkineni - Shakuntalam: గుణశేఖర్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న శాకుంతలంలో సమంత నటిస్తోన్న సంగతి తెలసిందే. ఈ సినిమా నిర్మాణంలో దిల్‌రాజు కూడా భాగమవుతున్నారట.

    ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న హీరోయిన్స్‌లో స‌మంత అక్కినేని ముందు వ‌రుస‌లో ఉంది. ‘ఓ బేబీ’తో భారీ హిట్ సాధించింది. అయితే గ‌త ఏడాది విడుద‌లైన ‘జాను’ డిజాస్ట‌ర్ కావ‌డం.. ఆమెకు నిరాశ‌ను క‌లిగించే అంశ‌మే. తర్వాత కోవిడ్ ప్రారంభం కావడంతో సమంత ఇంటికే పరిమితమైంది. కోవిడ్ ప్రభావ నేపథ్యంలో ఓటీటీలో ‘సామ్ జామ్‌’ కార్య‌క్ర‌మంతో అడుగు పెట్టింది. చిరంజీవి, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య అక్కినేని, రానా ద‌గ్గుబాటి వంటి స్టార్స్‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ సీజ‌న్ వ‌న్‌ను ఘ‌నంగానే ముగించింది. అయితే స‌మంత సినిమాలేవీ ఎందుకు క‌మిట్‌కాలేదు... కొంప‌దీసి స‌మంత‌కు ప్రెగ్నెన్సీనా అనే సందేహాలు కూడా వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల‌కు త‌న‌దైన రీతిలో స‌మాధానం ఇస్తూ వ‌చ్చింది స‌మంత‌.

    అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం సామ్ చాలా బిజి బిజీగా ఉండింది. మిద్దె తోట‌ను పెంచ‌డం వంటి ప‌నుల‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన స‌మంత. అలాగే గ్లామ‌ర్ దుస్తుల‌ను పోస్ట్ చేసి అక్కినేని ఫ్యాన్స్ అగ్ర‌హానికి గురైంది. ఏదేతేనేం ఎట్ట‌కేల‌కు స‌మంత పౌరాణిక సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించింది. గుణశేఖ‌ర్ దృశ్య‌కావ్యం శాకుంత‌లంలో శ‌కుంత‌ల‌కు పాత్ర‌లో స‌మంత న‌టిస్తుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే సామ్ ఫ్యాన్స్ అబ్బా ఈసారి మ‌న హీరోయిన్‌ను వెండితెర‌పై చూసుకోవ‌చ్చున‌ని అంద‌రూ అనుకున్నారు.

    కాగా.. శాకుంత‌లం సినిమాలో స‌మంత అక్కినేని నటించ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ట‌. ఏంటా బ‌ల‌మైన కార‌ణం అంటే.. అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్ ఈ ఏడాది ప్రారంభంలో స‌మంత‌తో జాను సినిమాను నిర్మించాడు. అది కాకుండా అప్ప‌టికే కొన్ని దిల్‌రాజు సినిమాల్లో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. ఆ ప‌రిచ‌యంతో దిల్‌రాజు శాకుంత‌లంలో స‌మంత‌ను న‌టించేలా ఒప్పించాడ‌ట‌. అస‌లు శాకుంత‌లంలో స‌మంత‌ను ఒప్పించ‌డానికి దిల్‌రాజుకు ఉన్న ఆస‌క్తి ఏంటి? అనే సందేహం రాక మాన‌దు. అస‌లు విష‌య‌మేమంటే.. శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. అప్పుడెప్పుడో ప్రతాపరుద్ర సినిమాను నిర్మిస్తానని దిల్‌రాజు స‌భా ముఖంగా చెప్పాడు. అయితే, త‌ర్వాత ఆ ప్రాజెక్ట్ ప‌క్క‌న ప‌డింది. ఏదేతేనేం ఎట్ట‌కేల‌కు గుణ‌శేఖ‌ర్‌, దిల్‌రాజు చేతులు క‌లుపుతున్నారంటే ఆ క్రెడిట్ స‌మంత‌కే ద‌క్కుతుంది.
    Published by:Anil
    First published:

    Tags: Dil raju, Gunasekhar, Samantha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు