సాధారణంగా నటి సమంత ఏది చేసినా సంచలనమే అవుతోందీ మధ్య. నాగచైతన్యతతో విడాకుల తర్వాత ఆమె క్రేజ్ రెట్టింపు కావడం, ఆ స్థాయికి తగ్గట్టే సామ్ అందాల ప్రదర్శనా పెరగడం తద్వారా సోషల్ మీడియాలో ఆరని మంటలు రగిలిస్తుండటం తెలిసిందే. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న దరిమిలా ఇప్పుడు ప్రతినోటా పాన్.. పాన్ పదం వినిపిస్తుండగా, సమంత మాత్రం పాన్ ఇండియానా బొక్కా? అంటూ క్రేజీ కామెంట్లను షేర్ చేసి బాంబు పేల్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..
నటి సమంత ఆ మధ్య 'పుష్ప' సినిమాలో ‘ఊ అంటావా మావా..’ ఐటెం సాంగ్ చేసి అభిమానుల్ని వెర్రెత్తించడం గుర్తుందికదా, బాహుబలి తర్వాత తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా నిలబెట్టిన ‘పుష్ప’లో సమంత ఐటం నంబర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊ అంటావా పాట ఆడియో, వీడియోలు యూట్యూబ్ రికార్డులను షేక్ చేశాయి. అయితే ఇప్పుడా పాట పాన్ ఇండియాను దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి చేరింది. అందుకే సమంత పాన్ ఇండియానా బొక్కా కామెంట్ షేర్ చేసింది..
అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీ ప్రపంచ పాప్ మ్యూజిక్ కల్చరల్ కేంద్రంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆల్ట్రా మియామి పేరుతో ప్రపంచలోనే అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ ప్రతిఏటా మార్చి నెలలో జరుగుతుంటుంది. అమెరికాసహా పలు దేశాల నుంచి లక్షల మంది సంగీతాభిమానులు ఆ వేడుకలో పాలుపంచుకుంటారు. అలాంటి చోట..
సమంత పాట మియామీ ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్ట్ లో హైలైట్ గా నిలిచింది. ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్ట్ లో సమంత చేసిన ‘ఊ అంటావా మావ..’ పాటకు స్థానం లభించింది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ‘ఇది నమ్మశక్యం కానీ రీచ్.. పాన్ ఇండియానా బొక్కనా! పాన్ వరల్డ్’ అంటూ పుష్ప సినిమాను ఆకాశానికెత్తేసిన ఓ అభిమాని పోస్టును సామ్ షేర్ చేసింది.
? Are you sure this is #ultramiami .. ??? https://t.co/gpWui0Ruwz
— Samantha (@Samanthaprabhu2) March 27, 2022
‘నిజంగా ఇది మియామీ ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్టేనా?’ అంటూ సమంత పెట్టిన ట్వీట్ వైరలైంది. మధ్యలో మద్యం సహా అన్ని బ్రాండ్లకు మోడలింగ్ చేస్తూనే సినిమాలపైనా ఫోకస్ పెట్టింది సమంత. ఇప్పటికే తన తొలి పౌరాణిక సినిమా 'శాకుంతలం' షూటింగ్ ఫినిష్ చేసి 'యశోద' ప్రాజెక్టుతో బిజీగా ఉంది. వీలు కుదిరినప్పుడల్లా స్నేహితులతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pushpa Movie, Samantha akkineni, Samantha twitter, Tollywood actress