Samantha Naga Chaitanya: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సంవత్సరమైనా బావుండాలని అందరూ 2021కి స్వాగతం చెబుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకలకు తమకు ఇష్టమైన వారితో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ రియల్ కపుల్స్ చైతన్య, సమంత తమ కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వారి ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లిన ఈ జంట అక్కడే న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తన భర్తతో కలిసి ఫొటోను తీసుకొని దాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలో సమంత, చైతన్యకు ముద్దు పెడుతుండగా.. చై, ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఈ ఫొటోకు మా తరఫున నుంచి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కామెంట్ పెట్టింది సమంత. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అటు సమంత, ఇటు చైతన్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. సూపర్ పెయిర్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా.. ఇటీవలే మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలోనే లవ్ స్టోరీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యులో నటించనున్నారు చైతన్య. థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది.
View this post on Instagram
అలాగే సమంత.. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న కాటు వాకుల రెండు కాదల్ మూవీలో సమంత నటించనుంది. ఈ మూవీలో తొలిసారిగా నయనతార, సమంత కలిసి నటించబోతున్నారు. ఇక దీంతో పాటు అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ కథాంశంలోనూ సమంత నటించనున్నట్లు సమాచారం. వీటితో పాటు గుణశేఖర్ తెరకెక్కించనున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలోనూ సమంత నటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Samantha, Samantha akkineni