Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కడ తగ్గడం లేదు. అంతేకాదు డైవోర్స్ తర్వాత ఈమెకు టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో ఈమెకు క్రేజ్ పెరిగింది. సినిమాల విషయంలో సమంత దూకుడు పెంచింది. అంతేకాదు ఇంతకు ముందు ఎపుడు లేనట్టు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’లో ఊ..అంటావా మావ.. ఊహూ అంటావా.. అంటూ ఐటెం సాంగ్ చేయడం ఒక ఎత్తు అయితే.. అందులో అందాల ఆరబోసి చేసి ఔరా అనిపించింది. ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ రాబట్టింది.తాజాగా ఈ పాట కోసం సమంత ఏ రేంజ్‌లో కష్టపడిందో తెలిపే ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పాట కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి చేసిన డాన్స్ మూమెంట్స్‌ను చూసి అభిమానులు ఔరా.. ఓ పాట కోసం హీరోలు, హీరోయిన్లు ఏ రేంజ్‌లో కష్టపడతారన్నది మరోసారి తెలియవచ్చింది. సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఎటు చూసిన మొత్తం పుష్ప ఐటెం సాంగ్ హావానే నడుస్తోంది.
చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ఎత్తైతే...ఈ ఊర మాస్ పాటకు సమంత వేసిన సెప్ట్ లు కుర్రాకారు గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే తన విభిన్నమైన గొంతుతో విశేష ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడిన విధానం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఈ సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులు పాటకు మరింత హైపు తీసుకొచ్చాయి. సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈ పాట విడుదల కావడంతో ఈ పాటకు మరింత హైప్ వచ్చిందని అంటున్నాయి సినీ వర్గాలు.
Chiranjeevi : బాబీ సినిమాలో చిరంజీవి సరసన బాలయ్య భామ.. త్వరలో అధికారిక ప్రకటన..
ఇక సమంత విషయానికొస్తే.. ఈమె వరుసగా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటున్నారు స్యామ్. రీసెంట్‌గా సమంత.. మరో సినిమాకు సైన్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' చిత్రంలో యాక్ట్ చేస్తోంది. దాంతో పాటు సామ్ నటించిన ‘శాకుంతలం’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు హిందీ,తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది. రీసెంట్‌గా సమంత.. ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్‌ను ఒర్మాక్స్ మీడియా విడదల చేసింది. భారతీయ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ పర్ఫామెన్స్‌తో అద్భుతంగా మెప్పించిన టాప్ 5 యాక్టర్స్ లిస్టులో సమంత నాల్గో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pushpa, Samantha Ruth Prabhu, Tollywood