హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: ఆ హీరోలకు దక్కని సక్సెస్.. సమంత ‘శాకుంతలం’తో అందుకుంటుందా.. ?

Samantha: ఆ హీరోలకు దక్కని సక్సెస్.. సమంత ‘శాకుంతలం’తో అందుకుంటుందా.. ?

Samantha Akkineni : వాళ్లకు దక్కని సక్సెస్.. సమంత ’శాకుంతలం’ సినిమాతో దక్కించుకుంటా వివరాల్లోకి వెళితే.. 

Samantha Akkineni : వాళ్లకు దక్కని సక్సెస్.. సమంత ’శాకుంతలం’ సినిమాతో దక్కించుకుంటా వివరాల్లోకి వెళితే.. 

Samantha Akkineni : వాళ్లకు దక్కని సక్సెస్.. సమంత ’శాకుంతలం’ సినిమాతో దక్కించుకుంటా వివరాల్లోకి వెళితే.. 

  Samantha Akkineni : వాళ్లకు దక్కని సక్సెస్.. సమంత ’శాకుంతలం’ సినిమాతో దక్కించుకుంటా వివరాల్లోకి వెళితే..  సమంత అక్కినేని తొలిసారి పౌరాణిక సినిమా ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంను గుణశేఖర్ పట్టాలెక్కించాడు. ఈ సోమవారమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్ర శకుంతల పాత్రలో నటిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా యాక్ట్ చేస్తున్నాడు. సమంత విషయానికొస్తే.. ‘ఏమాయ చేసావే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తన తొలి చిత్ర హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్.. మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. అక్కినేని హీరోలు హిట్టు కోసం ముఖం వాచిపోతుంటే.. సమంత మాత్రం వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది.

  ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. ఇక సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘శాకుంతలం’ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు గుణశేఖర్.. ‘రుద్రమదేవి’ తర్వాత చేస్తోన్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యలో  రానాతో హిరణ్య కశ్యప అనుకున్నా కూడా అది పట్టాలెక్కలేదు. తాజాగా సమంత ముఖ్యపాత్రలో ‘శాకుంతలం’ సినిమా అనౌన్స్ చేసాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు దుర్వాస ముని పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

  Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni Shakuntalam,Samantha Akkineni Shakuntalam movie,Samantha Akkineni Shakuntalam dushyant,Samantha Akkineni Shakuntalam dev mohan dushyant,Samantha Akkineni Shakuntalam gunasekhar movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని శాకుంతలం సినిమా,శాకుంతలం సినిమా దుష్యంతుడు,దేవ్ మోహన్ దుష్యంతుడు శాకుంతలం సినిమా
  సమంత అక్కినేని శాకుంతలం (Samantha Akkineni)

  ఈ సినిమాను మహాభారతంలోని ఆదిపర్వం మూలం. ఈ సినిమాను గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మహాకవి కాళిదాసు రాసిన శాకుంతలం నాటకం .. వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. ఇప్పటికే ఈ స్టోరీతో తెలుగులో  రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో కమలకర కామేశ్వరరావు తెరకెక్కించారు.

  ఎన్టీఆర్, బి.సరోజా దేవిల ‘శకుంతల’ మూవీ (Youtube/Credit)

  ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించాడు. అందులో ఓ భాగంగా శకుంతల, దుష్యంతుల ప్రణయ గాథ ఉంటుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఐతే.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

  ఎన్టీఆర్, బాలకృష్ణల ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’(File/Photo)

  మరి ఎన్టీఆర్ ఒకసారి తాను సోలో హీరోగా.. మరోసారి తన కుమారుడు బాలకృష్ణను దుష్యంతుడి పాత్రలో  తెరకెక్కించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. రెండు సార్లు ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ఈ  సబ్జెక్ట్‌తో సమంత హీరోయిన్‌గా గుణశేఖర్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

  ‘శాకుంతలం’లో సమంత (Instagram/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే... గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దుష్యంతుడితో పాటు కణ్వ మహర్షి, విశ్వామిత్రుడు, మేనక వంటి పాత్రలను ఎవరు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  First published:

  Tags: Balakrishna, Gunasekhar, NTR, Samantha akkineni, Shakuntalam Movie, Tollywood

  ఉత్తమ కథలు