HOME »NEWS »MOVIE »samantha shaakuntalam update gunasekhar gives clarity over dushyanta role here are the details sr

Shakuntalam : సమంత శాకుంతలంలో దుష్యంతుడి గురించి క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్..

Shakuntalam : సమంత శాకుంతలంలో దుష్యంతుడి గురించి క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్..
సమంత అక్కినేని Photo : Instagram

Samantha Shakuntalam : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ కొన్ని సంవత్సరాల తర్వాత శాకుంతలం అనే పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని ప్రకటించిన సంగతితెలిసిందే.

  • Share this:
    ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ కొన్ని సంవత్సరాల తర్వాత శాకుంతలం అనే పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని ప్రకటించిన సంగతితెలిసిందే. సమంత ఈ సినిమాలో ప్రధాన టైటిల్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. గుణశేఖర్ గతంలో అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి అనే కాకతీయ రాణీ గురించి ఓ చిత్రాన్ని రూపోందించిన సంగతితెలిసిందే. ఈ సినిమా తర్వాత నిజానికి రానాతో చేయవలసిన ‘హిరణ్యకశిప’ మొదలుకావాల్సిఉండగా.. ఈ సినిమాకు కాస్తా సమయం ఉండటంతో గుణశేఖర్ తాజాగా శాకుంతలంను ప్రకటించాడు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు గుణశేఖర్. అంతబాగానే ఉన్న ఈ సినిమా గురించి ఓ రూమర్ గుణశేఖర్‌ను నిద్రపోనియ్యాకుండా చేస్తోందట. అదేంటంటే.. టైటిల్‌ రోల్‌లో సమంత చేస్తోండగా.. అంటే శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ వదంతులకు కొదవ ఉండదు కాబట్టి దుష్యంతుడి పాత్రలో నటించబోయేది ఆ హీరో అని.. కొన్ని వార్తలు.. కాదు కాదు ఈ హీరో అని మరికొన్ని వార్తలు రావడం తెలిసిందే.

    దీంతో ఈ విషయంపై స్పందించిన గుణశేఖర్ సమంత మినహా మిగతా పాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఏవరెవరి పేర్లను తమ దుష్యంతుడిగా ప్రచారం చేయవద్దని అందరినీ కోరారు. ఇలా ప్రస్తుతం దుష్యంతుడి విషయంలో క్లారిటీ ఇచ్చాడు గుణశేఖర్.












    View this post on Instagram






    A post shared by Gunasekhar (@gunasekhar1)








    ఇక ఇటీవల ఈ శాకుంతలం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌ను పంచుకున్నాడు గుణశేఖర్. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించని ఓ వీడియోను గుణ శేఖర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసుకున్నాడు. మామూలుగానే గుణశేఖర్ సినిమాల్లో సెట్స్ ఓరేంజ్‌లో ఉంటాయి. ఆయన వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. సినిమా డిమాండ్ చేస్తే ఒక్క సన్నివేశమైనా సరే భారీ సెట్టింగులను రూపోందిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాల్లోని సన్నివేశాలు చెక్కినట్టే ఉంటాయి. మహేష్ బాబు ‘ఒక్కడు సినిమాలో చార్మినార్, సైనికుడు లో బ్రిడ్జి, అర్జున్ లో భారీ దేవాలయం ఇలా ఆయన తీసిన ప్రతి సినిమాలో సెట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:January 21, 2021, 06:59 IST