హోమ్ /వార్తలు /సినిమా /

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ మూవీ నుంచి ‘యెలెలో యెలెలో’ పాట విడుదల..

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ మూవీ నుంచి ‘యెలెలో యెలెలో’ పాట విడుదల..

‘శాకుంతలం’ మూవీ నుంచి 3వ పాట విడుదల (Twitter/Photo)

‘శాకుంతలం’ మూవీ నుంచి 3వ పాట విడుదల (Twitter/Photo)

Shaakuntalam - Samantha Ruth Prabhu :సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. పెళ్లైనా.. విడాకులు అయినా.. ఈ అమ్మడు జోరు ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో బిజీగా మారింది. గతేడాది ‘యశోద’ మూవీతో మంచి హిట్ అందుకున్న సమంత.. ఇపుడు గుణ శేఖర్ దర్శకత్వంలో తొలిసారి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమాతో టైటిల్ రోల్లో  పలకరించబోతుంది.ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Shekar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు (Dil Raju) సంయుక్తంగా నిర్మించారు.

మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా మొదట నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆ డేట్‌కు రావడం లేదని 3Dతో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ప్రోడ్యూసర్స్. ఇక ఆ తర్వాత లేటెస్ట్‌గా ఈసినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక వరుసగా ఈ సినిమా నుంచి పాటలను విడుదలచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి మల్లికా.. మల్లికా (Mallika Mallika - Lyrical ) అంటూ సాగే  ఫస్ట్ లిరికల్ శాకుంతలం టీమ్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచగా రమ్య బెహరా (Ramya Behara) పాడారు. చైతన్య ప్రసాద్ రచించారు. రుషి వనంలోన అంటూ సాగే రెండో పాట కూడా విడుదలై ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట ‘యెలెలో యెలెలో’ పాటను విడుదల చేసారు.

ఈ పాటను మణిశర్మ స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి పాడారు. తాజాగా  ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఒకవేళా మరోసారి విడుదల వాయిదా పడితే.. బహుశా ఈ సినిమా మార్చి లేదా వేసవి కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా విడుదల నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక శాకుంతలం విషయానికి వస్తే.. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా యశోద సినిమా చేసిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నవంబర్ 11న విడులైంది. హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు.

First published:

Tags: Gunasekhar, Samantha Ruth Prabhu, Shaakuntalam, Tollywood

ఉత్తమ కథలు