హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: శాకుంతలం 3D ట్రైలర్.. అబ్బురపరిచే విజువల్స్

Samantha: శాకుంతలం 3D ట్రైలర్.. అబ్బురపరిచే విజువల్స్

Shakunthalam 3D trailer

Shakunthalam 3D trailer

Shaakuntalam 3D Trailer Launch: గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది సమంత. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర 3D ట్రైలర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టిన సమంత (Samantha) దూకుడుగా మూవీస్ చేస్తోంది. డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇటీవలే మాయోసైటిస్ అనే వ్యాధికి గురై కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకున్న సమంత.. తిరిగి సినిమాలు చేస్తోంది. రీసెంట్ గానే తాను కమిటైన సినిమాల సెట్స్ మీదకొచ్చిన సామ్.. చకచకా షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఇప్పటికే శాకుంతలం (Shaakuntalam) సినిమా కంప్లీట్ కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్.

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత కెరీర్ లో వస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. నీలిమ గుణ, దిల్ రాజు (Dil Raju) నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా నటిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో మోహ‌న్ బాబు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఈ క్రమంలోనే తాజాగా శాకుంతలం 3D ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్.

రీసెంట్ గానే 3D వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా 3D ట్రైలర్ ని మీడియా కోసం ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శించారు. ఈ ట్రైలర్ చుసిన మీడియా పర్సన్స్ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత కెరీర్‌లో డిఫరెంట్ జానర్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

First published:

Tags: Samantha Ruth Prabhu, Shaakuntalam, Tollywood