Samantha Akkineni : సమంత.. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా అదరగొడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అది అలా ఉంటే.. సమంత మాట్లాడుతూ.. నటన పరంగా, వ్యక్తిగతంగా మనం ఎప్పటికప్పుడు పరిణతి చెందాల్సిందే అంటోంది. లేకపోతే రాణించలేమని చెబుతూ దానికోసం ఎంతైనా శ్రమించాలి అంటోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘ మొదట మనం శ్రమిస్తే తప్పకుండా వెనుకో ముందో అందుకు తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుందని.. చెప్పింది. ఇదే తాను నమ్మే సిద్దాంతం అని చెబుతూ..అందులో భాగంగా కష్టపడటం అలవాటు చేసుకొన్నాని అంటోంది. అయితే తాను నటించిన కొన్ని పాత్రల కోసం నిద్రలేని రాత్రులు గడిపానని.. ఆ జర్నీని కూడా ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పింది.
అంతేకాదు నటిగా నాకు ప్రతి పాత్ర తనకు ఓ కొత్త చాలెంజ్‌ను ఇవ్వాలని.. ఎలా అంటే ఆ పాత్ర చేయాలంటే భయం వేయాలని చెబుతోంది. అప్పుడే మనం చేసే ఆ పాత్రలో ప్రత్యేకత ఉన్నట్టు.. ఎప్పుడైతే అలాంటి పాత్రలు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటోంది సమంత. ప్రస్తుతం ఈ భామ.. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సమంత అదిరిపోయే హాట్ పిక్స్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.