Allu Arjun Sam Jam: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన అభిమానుల కోసం న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంతకు ఆ న్యూస్ ఏంటంటే.. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహాలో సమంత హోస్ట్‌గా సామ్ జామ్ అనే ప్రోగ్రామ్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రీమియర్ అవ్వనుంది. మరి సమంత, బన్నీ కలిసి చేసిన సందడిని చూడాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే. కాగా సామ్ జామ్‌లో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను సమంత ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ శుక్రవారం ప్రీమియర్ అవ్వనుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురములోతో పెద్ద హిట్‌ని ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తున్నారు. బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది కాగా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా రఫ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు.
A New Year gift for all. #SamJam with 'Stylish Star' @alluarjun premieres on 1st Jan, 2021 💥#SamJamWithAA @Samanthaprabhu2 @ahavideoIN #AlluArjun pic.twitter.com/Aqiz8xkmFK
— Sam Jam (@thesamjamshow) December 23, 2020
ఆయన సరసన మొదటిసారిగా రష్మిక మందన్న జోడీ కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై ఇటు అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పూర్తైన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాలో కనిపించనున్నారు బన్నీ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Samantha, Samantha akkineni, Tollywood