హోమ్ /వార్తలు /సినిమా /

Yashoda Teaser: ప్రెగ్నెన్సీలో కూడా సమంత డేరింగ్ స్టెప్స్

Yashoda Teaser: ప్రెగ్నెన్సీలో కూడా సమంత డేరింగ్ స్టెప్స్

Samantha (Photo Twitter)

Samantha (Photo Twitter)

Samantha: ఇప్పటికే శాకుంతలం సినిమా ఫినిష్ చేసిన సామ్.. ఇప్పుడు యశోద మూవీ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది సమంత (Samantha Ruth Prabhu). వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంటూ సెట్స్ మీద చురుకుగా కదులుతోంది. నిమిషం తీరిక లేకుండా తాను కమిటైన అన్ని సినిమాలు కంప్లీట్ చేస్తోంది. విలక్షణ కథలు, డిఫరెంట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శాకుంతలం (Shakunthalam) సినిమా ఫినిష్ చేసిన సామ్.. ఇప్పుడు యశోద (Yashoda) మూవీ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.హ‌రి-హ‌రీశ్ (Hari-Harish) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ యశోద సినిమాను శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా డ‌బ్ చేయ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతూ జనాల్లో ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్ప్స్, పోస్టర్స్ సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేశాయి.


ఇక తాజాగా విడుదల చేసిన యశోద టీజర్.. ఈ సినిమాలో సమంత రోల్ మెస్మరైజ్ చేయనుందని, ఈ రోల్ కోసం సమంత ఎంతో శ్రమించిందని స్పష్టం చేస్తోంది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయిన ఈ టీజర్ లో సమంత గర్భవతిగా కనిపించింది. గర్భవతిగా ఉన్న సమయంలో ఏ ఏ పనులైతే చేయొద్దని డాక్టర్ చెబుతారో ఏవ్ చేస్తూ సమంత కనిపించింది. అంటే ఇది ఎంతో చాలెంజింగ్ రోల్ అని చెప్పకనే చెప్పారు మేకర్స్.


ఈ టీజర్ లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో సమంత రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండనుందని మాత్రం తెలుస్తోంది. ఈ టీజర్ ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూ బలం, సంకల్పం అంటూ ట్యాగ్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Samantha Ruth Prabhu, Tollywood actress, Yashoda Movie

ఉత్తమ కథలు