Home /News /movies /

SAMANTHA RUTH PRABHU SPECIAL BIRTHDAY WISHES TO VIJAY DEVARAKONDA SR

Samantha Ruth Prabhu : విజయ్‌కు సమంత స్పెషల్ బర్త్ డే విషెస్.. వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్..

Samantha and Vijay Photo : Twitter

Samantha and Vijay Photo : Twitter

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీస్ ఆయన బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక అందులో భాగంగా సమంత (Samantha Ruth Prabhu) తాజాగా విజయ్‌కు బర్త్ డే విషెస్‌ను తెలిపారు. సమంత తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాస్తూ... ‘లైగర్ విజయ్ దేవరకొండ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని.. అంతేకాదు ఎన్నో ప్రశంసు వస్తాయని.. వాటికి మీరు అర్హులు. విజయ్ మీరు ఎందరికో స్ఫూర్తిదాయకం, ప్రేరణ. గాడ్ బ్లెస్ యూ’ అటూ ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు ఒక స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విడి 11 పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యిందిని టాక్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మిర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అనన్యపాండే హీరోయిన్‌గా (Ananya Panday) చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

  లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.  మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

  ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha Ruth Prabhu, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు