SAMANTHA RUTH PRABHU NEW FILM KAATHU VAAKULA RENDU KAADHAL SHOOT COMPLETED PICS GOES VIRAL SR
Samantha Ruth Prabhu : షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత నయనతారల కాతు వాకుల రెండు కాదల్..
Kaathu Vaakula Rendu Kaadhal Team Photo : Twitter
Samantha Ruth Prabhu : సమంత ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి సమంత కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
Samantha Ruth Prabhu : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్రకటన తర్వాత సమంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు, రూమర్స్ వచ్చాయి. అన్నింటిని ఓపికగా భరిస్తూ ముందుకు సాగుతున్నారు సమంత. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి సమంత కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రెండు అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకానుంది.
సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు.
ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha Ruth Prabhu )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.