హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Ruth Prabhu : సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత యశోద మూవీ.. రిపోర్ట్ ఎలా ఉందంటే..

Samantha Ruth Prabhu : సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత యశోద మూవీ.. రిపోర్ట్ ఎలా ఉందంటే..

Yashoda Censor Photo : Twitter

Yashoda Censor Photo : Twitter

Samantha Ruth Prabhu : సమంత నటిస్తోన్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై వావ్ అనిపించింది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం నవంబర్ 11న విడుదలకానుంది. దీంతో తాజాగా టీమ్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. (Samantha Ruth Prabhu) ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు.. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆమె నటిస్తోన్న ప్యాన్ ఇండియా సినిమా యశోద (Yashoda). ఈ  సినిమా టీజర్ ఇటీవల విడుదలై వావ్ అనిపించింది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై అదరగొట్టింది. ఇక అది అలా ఉంటే  ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా U/A సర్టిఫికేట్ వచ్చినట్లు ప్రకటించింది టీమ్. ఇక మరోవైపు సెన్సార్ సభ్యులు ఈ సినిమా పట్ల పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యినట్లు టాక్ నడుస్తోంది.

ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. ‘మీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్ళు వినిపించాయా, ఒక బిడ్డని మోస్తున్న తల్లికి మాత్రమే ఆ విధమైన చప్పుడు వినిపిస్తుంది’ అంటూ సమంత మాటలతో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా సరోగసిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో పాటు యాక్షన్ సీన్స్, మణిశర్మ సంగీతం అదిరిపోయాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళీ భాషల్లో నవంబర్ 11 న విడుదల కానుంది.

యశోద సినిమాకు దర్శక ద్వయం హరి, హరీష్ కలిసి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇక ఇతర పాత్రల్లో ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు.

ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్‌ మొదటి వారంలలో షూటింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డికెలతో సమంత చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. చూడాలి మరి ఇది ఎలా ఆకట్టుకోనుందో..

ఇక సమంత ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆ డేట్‌కు రావడం లేదని తెలిపారు.  నవంబర్ 4 నాటికి ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడం లేదని.. దీనికి తోడు ఈ సినిమాను 3D ఫార్మాట్‌లో విడుదల చేయాలనుకుంటున్నారట చిత్రబృందం.

ఈ నేపథ్యంలో 3డి వర్క్స్‌కి మరింత సమయం అవసరం ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే కొత్త తేదీని ఇంకా ప్రకటించేదు.. దీనికి సంబంధించి త్వరలో కొత్త విడుదల తేదిని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ , గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్‌ వర్క్స్‌ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

First published:

Tags: Samantha Ruth Prabhu, Tollywood news, Yashoda Movie

ఉత్తమ కథలు