ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత (Samantha Ruth Prabhu).. ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుసగా సినిమాలను చేస్తూ తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్‌ను, మార్కేట్‌ను ఏర్పరచుకున్నారు. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. అందులో భాగంగా ఆమె తాజాగా నటించిన సినిమా యశోద (Yashoda). ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సమంత నటిస్తోన్న మరో భారీ సినిమా శాకుంతలం (Shaakuntalam ). పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Shekar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు (Dil Raju) సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా మొదట నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆ డేట్‌కు రావడం లేదని 3Dతో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ప్రోడ్యూసర్స్. ఇక ఆ తర్వాత లేటెస్ట్‌గా ఈసినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళా మరోసారి విడుదల వాయిదా పడితే.. బహుశా ఈ సినిమా మార్చి లేదా వేసవి కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా విడుదల నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక వరుసగా ఈ సినిమా నుంచి పాటలను విడుదలచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి మల్లికా.. మల్లికా (Mallika Mallika - Lyrical ) అంటూ సాగే ఫస్ట్ లిరికల్ శాకుంతలం టీమ్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచగా రమ్య బెహరా (Ramya Behara) పాడారు. చైతన్య ప్రసాద్ రచించారు. రుషి వనంలోన అంటూ సాగే రెండో పాట కూడా విడుదలై ఆకట్టుకుంటోంది.
Shakuntala and Dushyant are making their way into your hearts ????✨ Here are few hd stills from #Rushivanamlona song! - https://t.co/bJ798P0e2U#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial pic.twitter.com/h8W160LEWj
— Sri Venkateswara Creations (@SVC_official) January 28, 2023
ఇక శాకుంతలం విషయానికి వస్తే.. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా యశోద సినిమా చేసిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నవంబర్ 11న విడులైంది. హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.