ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత (Samantha Ruth Prabhu).. ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుసగా సినిమాలను చేస్తూ తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్‌ను, మార్కేట్‌ను ఏర్పరచుకున్నారు. ఆమె తాజాగా నటించిన సినిమా యశోద (Yashoda). ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సమంత నటిస్తోన్న మరో భారీ సినిమా శాకుంతలం (Shaakuntalam ). పౌరాణికం నేపథ్యంలో ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Shekar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు (Dil Raju) సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత చివరకు ఏప్రిల్ 14న వస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా లిరికల్ వీడియోలను వదులుతున్నారు.
సమంతకు జోడిగా దేవ్ మోహన్ రాజు దుష్యంత పాత్రలో నటిస్తున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి 3D ట్రైలర్ (Shaakuntalam 3D Trailer)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్. అంతేకాదు 3డి ట్రైలర్ లాంఛ్ ఎక్కడ చేయనుందో కూడా ప్రకటించింది. మార్చి 28 వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 3డి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నామని తెలిపారు.
Witness the visual spectacle, #Shaakuntalam3DTrailer Launch event on 28th March at 5PM????✨
????Screen 6, Prasads IMAX, HYD#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @neeta_lulla @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/DB7Y7k8D63 — Sri Venkateswara Creations (@SVC_official) March 26, 2023
ఇక శాకుంతలం కోసం తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా యశోద సినిమా చేసిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2022 నవంబర్ 11న విడులై సూపర్ హిట్ అయ్యింది. హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ప్రస్తుతం ఈవెబ్ సీరిస్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. వీటితో పాటు విజయ్ దేవరకొండతో సమంత ఖుషి సినిమా చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.