Home /News /movies /

SAMANTHA RUTH PRABHU IN THE GYM WORKOUT IS NOT NORMAL EVK

Samantha Ruth Prabhu: జిమ్‌లో స‌మంతా.. వ‌ర్క్ఔట్ మాములుగా లేదుగా!

స‌మంత‌

స‌మంత‌

Samantha Ruth Prabhu | సమంత‌ ఎక్కువ‌గా జిమ్‌లో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది. ఆమె ఎప్పుడూ త‌న దిన‌చ‌ర్య‌లో జిమ్‌కు ప్రాధాన్య‌త ఇస్తుంది. తాజాగా స‌మంత తాను జిమ్‌లో ఎంత క‌ష్ట‌ప‌డుతుందో.. ఎలాంటి వ‌ర్క్ఔట్‌లు చేస్తుందో వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమె ఫిట్‌నెస్ వీడియోల‌ను ఫ్యాన్స్ ముందు ఉంచింది

ఇంకా చదవండి ...
    సమంత‌ (Samantha) ఎక్కువ‌గా జిమ్‌లో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది. ఆమె ఎప్పుడూ త‌న దిన‌చ‌ర్య‌లో జిమ్‌కు ప్రాధాన్య‌త ఇస్తుంది. తాజాగా స‌మంత తాను జిమ్‌ (GYM)లో ఎంత క‌ష్ట‌ప‌డుతుందో.. ఎలాంటి వ‌ర్క్ఔట్‌లు చేస్తుందో వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమె ఫిట్‌నెస్ వీడియోల‌ను ఫ్యాన్స్ ముందు ఉంచింది. స‌మంత ఫిట్‌నెస్ ర‌హ‌స్యం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. సమంతా శుక్రవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో తన హార్డ్ వర్కౌట్ శిక్షణలో ఒక సూపర్ సాలిడ్ వీడియోను ఇన్‌స్టా వేదిక‌గా పంచుకుంది. ఈ వీడియ‌లో ఆమె డెడ్‌లిఫ్ట్ కోసం 80 కిలోల బార్‌బెల్‌ను ఎత్తడం మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ఇది చాలు స‌మంత ఫిట్‌నెస్, బ్యూటీ ర‌హ‌స్యం తెల‌సిపోతుంది.






    సమంత తన వర్కవుట్ సెషన్‌లో స్నీక్ పీక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గ‌తంలోనూ చాలా సార్లు ఆమె జిమ్ ప్రాక్టీస్ వీడియోలు షేర్ చేసుకొంది. ఈ వీడియోల‌కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇలా క‌ష్ట‌ప‌డుతుంది కాబ‌ట్టే అంత ఫిట్‌గా ఉంద‌ని చెబుతున్నారు.

    Sophie Choudry: బీచ్‌లో కిర‌క్ ఫోటోల‌తో మ‌తి పోగొడుతున్న‌.. బోల్డ్ బ్యూటీ సోఫీ చౌద‌రి!







    తాజాగా స‌మంత అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ - పార్ట్ Iలో ఒక ప్ర‌త్యేక పాట‌లో క‌న‌పించింది. ఈ పాట‌లో స‌మంత త‌న మార్క్ స్టెప్‌ల‌తో ఆక‌ట్టుకొంది. అంతేకాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ 2లో స‌మంత న‌ట‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొంది.

    Aisha Sharma: చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు.. ఐషాశ‌ర్మ అద‌ర‌గొట్టే ఫోటో షూట్‌!


    సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 2021లో, నటి నాగ చైతన్యతో తన వైవాహిక జీవితాన్ని ముగింపు ప‌లికింది. అంతే కాకుండా 2021 అత్యుత్తమ ప్రదర్శనకారులపై ఫిల్మ్ కంపానియన్ యొక్క రెట్రోస్పెక్టివ్‌లో కనిపించిన సమంతా తన చైత‌న్య నుంచి విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధ‌ గురించి మాట్లాడింది.

    “2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతిదానితో నాకు ఎలాంటి అంచనాలు లేవు. నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏది ఎదురు చూస్తుందో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి నా బెస్ట్ ఇస్తాను" అని సమంత ఇటీవ‌ల తెలిపింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Samantha Ruth Prabhu, Tollywood, Tollywood actress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు