హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Ruth Prabhu | Arabic Kuthu : విజయ్ అరబిక్‌ కుత్తు పాటకు అదరగొట్టిన సమంత.. వీడియో వైరల్..

Samantha Ruth Prabhu | Arabic Kuthu : విజయ్ అరబిక్‌ కుత్తు పాటకు అదరగొట్టిన సమంత.. వీడియో వైరల్..

Samantha Instagram

Samantha Instagram

Samantha Ruth Prabhu | Arabic Kuthu : సమంత ప్రస్తుతం తమిళ్‌లో అదరగొడుతోన్న విజయ్ అరబిక్‌ కుత్తు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో క‌థ‌నాలు, రూమర్స్ వ‌చ్చాయి. అన్నింటిని ఓపిక‌గా భ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు స‌మంత‌. ఇక అది అలా ఉంటే సమంత ప్రస్తుతం తమిళ్‌లో అదరగొడుతోన్న విజయ్ అరబిక్‌ కుత్తు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పాట. విజయ్‌ హీరోగా నటించిన ‘బీస్ట్‌’లోని ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్‌ చేస్తోంది. ఈ పాటకు సమంత తనదైన స్టైల్లో డాన్స్ వేస్తూ అదరగొట్టారు. అంతేకాదు ఈ వీడియోను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  ఇక సమంత విడాకుల తర్వాత సూపర్ బిజీగా మారారు. అందులో భాగంగా సమంత ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు మరోసారి వెబ్ సరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించి సరైనా లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నారట. అందులో భాగంగా సమంత తన వెబ్ సిరీస్ కోసం కఠోర శిక్షణ తీసుకుంటోందని తాజా సమాచారం. ఈ తాజా వెబ్ సిరీస్‌ను కూడా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది.


  ఇక వీటితో పాటు మరోవైపు సమంతకు హిందీలో పలు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాగా పాపులరైన సమంతకు అక్కడ మూడు సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ వచ్చాయని టాక్. యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు సమంతతో యష్ రాజ్ మూడు సినిమాలకు ఒప్పందం చేసుకుందని అంటున్నారు. సమంతకు భారీగా రెమ్యునరేషన్‌ ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు స‌మంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో మొద‌లుపెట్ట‌బోతున్న ఓ తెలుగు సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ (Samantha remuneration)ను పెంచేసింద‌ని టాక్. ఇప్పటి నుంచి కొత్త సినిమాకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమచారం తెలియాల్సి ఉంది.

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నారు. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేస్తున్నారు. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు యశోద అనే పేరును ఖరారు చేసింది చిత్రబృందం.

  Bheemla Nayak OTT : భారీ ధరకు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  ఇక సమంత నటిస్తున్నఇతర సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  వీటితో పాటు సమంత ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా డబ్ చేస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hero vijay, Samantha Ruth Prabhu, Tollywood news

  ఉత్తమ కథలు