Home /News /movies /

SAMANTHA RUTH PRABH WAS INSULTED BY OFFERING SECOND HEROINE CHANCES A RUMOUR GOES VIRAL HERE ARE THE DETAILS SR

Samantha Ruth Prabhu : సమంతను అవమానించిన బాలీవుడ్.. ఇంత జరిగిందా..

Samantha Ruth Prabhu Instagram

Samantha Ruth Prabhu Instagram

Samantha Ruth Prabhu : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇంకా చదవండి ...
  సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండVijay Devarakonda)తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెచ్యూర్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ అప్ డేట్ వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను టీమ్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఖుషి (Kushi) అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

  ఇక అది అలా ఉంటే సమంతకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ఒక్కసారిగా ఇటు సౌత్ నుంచే కాకుండే అటు నార్త్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీనికి తోడు పుష్ప(Pushpa)లో ఐటెమ్ సాంగ్ వల్ల ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది నార్త్‌లో.. అందులో భాగంగా పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే నార్త్ నుంచి ఆమెకు పలు ఆఫర్స్ వచ్చిన వాటిని ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

  Samantha In Bollywood Movie, Samantha, Shaakuntalam, Yashoda, Bollywood news, Tollywood news, Vijay Devarakonda ,samantha Ruth Prabhu latest Instagram comments, Samantha news, Samantha updates,Samantha films,Samantha pics,నాగ చైతన్య, సమంత
  శాకుంతలం Photo : Twitter


  ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ తెలుగు సినిమాలపైనే ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే.. హిందీ నుండి వస్తోన్న ఆఫర్స్‌ అన్ని కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు వచ్చాయట. దీంతో ఆ ఆఫర్స్‌‌ను కాదంటూ.. సున్నితంగా నో చెప్పిందట. ఇక ఈ వార్త తెలుసుకున్న సమంత అభిమానులు మాత్రం మా అభిమాన నటికి సెకండ్ హీరోయిన్‌గా అవకాశం ఇస్తారా.. అంటూ ఇది ఓరకంగా అవమానమే అంటూ ఫీల్ అవుతున్నారట.

  Samantha In Bollywood Movie, Samantha, Shaakuntalam, Yashoda, Bollywood news, Tollywood news, Vijay Devarakonda ,samantha Ruth Prabhu latest Instagram comments, Samantha news, Samantha updates,Samantha films,Samantha pics,నాగ చైతన్య, సమంత
  ఈగలో సమంత Photo : Twitter


  ఇక సమంత ఇటీవల నయనతారతో కలసి కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే సినిమాలో నటించారు. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి హీరోగా చేశారు. ఈ సినిమాను తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా (Kanmani Rambo Khatija) డబ్ చేశారు. సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  Samantha In Bollywood Movie, Samantha, Shaakuntalam, Yashoda, Bollywood news, Tollywood news, Vijay Devarakonda ,samantha Ruth Prabhu latest Instagram comments, Samantha news, Samantha updates,Samantha films,Samantha pics,నాగ చైతన్య, సమంత
  ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత Photo : Twitter


  ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు.

  Samantha In Bollywood Movie, Samantha, Shaakuntalam, Yashoda, Bollywood news, Tollywood news, Vijay Devarakonda ,samantha Ruth Prabhu latest Instagram comments, Samantha news, Samantha updates,Samantha films,Samantha pics,నాగ చైతన్య, సమంత
  యశోద మూవీ (Twitter/Photo)


  ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha Ruth Prabhu )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. వీటితో పాటు సమంత నటించిన ‘యశోద’ కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha Ruth Prabhu, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు