షాద్నగర్ దిశా హత్య కేసులో నిందితులను పోలీసులు ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారని సమాచారం. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. నవంబరు 28న రాత్రి శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో లారీలపై పని చేసే నలుగురు వ్యక్తులు దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి వద్ద తగులబెట్టారు. ఈ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని అందరూ డిమాండ్ చేస్తున్న సమయంలోనే.. వారిని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనపై సమంత ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఆమె స్పందిస్తూ తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగితవారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అని చెప్పింది. అందుకే తెలంగాణ అంటే ప్రేమ అని తెలిపింది.
I ❤️ TELANGANA . Fear is a great solution and sometimes the only solution .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.