Samantha: అన్ని వందల కోట్లు భరణంగా ఇస్తానంటే వద్దన్న సమంత..?

చైతన్య, సమంత(ఫైల్ ఫొటో)

Chaitanya Samantha Divorce: టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా ఉన్న సమంత (Samantha), నాగచైతన్యలు (Naga Chaitanya) విడిపోయారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విడాకులు ద్వారా సమంత చైతన్య ఫ్యామిలీ నుంచి ఎంత భరణం పొందుతుందనే చర్చ నడుస్తోంది.

 • Share this:
  Chaitanya Samantha Divorce: టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా ఉన్న సమంత (Samantha), నాగచైతన్యలు (Naga Chaitanya) విడిపోయారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలా తమ పదేళ్ల ప్రేమ బంధానికి చై, సామ్‌లు ముగింపు పలికారు. ‘చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మేము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానులు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాలి అంటూ సమంత, చైతన్యలు వేర్వేరుగా పోస్ట్‌లు చేశారు.

  అయితే చైతన్య, సమంత విడాకులకు (Naga Chaitanya Samantha Divorce) సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుుంది. ముఖ్యంగా వారు ఎందుకు విడిపోయారు..?, విడిపోవడానికి కారణలేమిటి..? అనే అంశంపై నెటిజన్లు తమకు తోచిన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరోవైపు విడాకులు ద్వారా సమంత చైతన్య ఫ్యామిలీ నుంచి ఎంత భరణం పొందుతుందనే చర్చ సాగిస్తున్నారు. ఈ విడాకుల ప్రాసెస్‌లో భాగంగా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ. 250 కోట్ల రూపాయల నుంచి రూ. 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొందరూ మాత్రం రూ. 50 కోట్ల ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  Samantha - Naga Chaitanya: సమంత, చైతన్యల పదేళ్ల ప్రేమ.. వైరల్ అవుతున్న ఆ 10 ఫొటోలు

  అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. సమంత భరణం తీసుకుంటుందనే వార్తలపై Hindustantimes ఓ కథనాన్ని రిపోర్ట్ చేసింది. వారికి ఉన్న సోర్స్‌ు ఉటంకిస్తూ.. సమంత భరణం తీసుకోవడానికి నిరాకరించిందని పేర్కొంది. ‘మ్యారేజ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా చైతన్య కుటుంబం సమంతకు రూ. 200 కోట్లు ఆఫర్ చేశారని.. కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదు. వివాహ బంధానికి ముగింపు పలకాల్సి రావడంతో సమంత కలత చెందిందని, ఆమె కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంది. ఇప్పుడు ఆ బంధం ముగిసిపోవడం.. ఆమె మరేమీ ఆశించలేదు’అని సంబంధిత వర్గాలు తెలిపినట్టుగా వెల్లడించింది. ఇక, చైతు, సమంతలను కలిపేందుకు సన్నిహితులు ప్రయత్నించినప్పటికీ.. వేర్వేరు కారణాల వల్ల అది వీలు పడలేదని తెలుస్తోంది.

  Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ఇదే..

  ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్-2లో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha akkineni )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.
  Published by:Sumanth Kanukula
  First published: